రాష్ట్రపతికి కూడా వివ‌రించాం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-17 17:07:31

రాష్ట్రపతికి కూడా వివ‌రించాం

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు ప్ర‌త్యేక హోదాను డిమాండ్ చేస్తూ ప్ర‌తిప‌క్ష వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు అలుపెరుగ‌ని పోరాటం చేస్తున్నారు...హోదా సాధ‌న కోసం నిర‌స‌న‌లు ఉద్య‌మాలు, రిలేదీక్ష‌లు చేస్తున్నారు..ఇక హోదా పోరాట స‌మితి వైసీపీ వామ‌ప‌క్షాలు నిన్న‌ రాష్ట్ర బంద్ కు పిలుపునిచ్చిన సంగ‌తి అంద‌రికీ తెలిసిందే.. ఇక తాజాగా రాష్ట్రంలో నెల‌కొంటున్న పరిస్థితుల‌ను అలాగే విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల‌పై చ‌ర్చించేందుకు ఈ రోజు రాష్ట్ర‌ప‌తి రామ్ నాథ్ కోవింద్ ను వైసీపీ ఎంపీలు క‌లిశారు.. రాష్ట్ర‌ప‌తిని క‌లిసిన  త‌ర్వాత వారు త‌మ ప‌ద‌వుల‌కు రాజీనామా చేశారు.
 
త‌మ రాష్ట్రాన్ని కేంద్రం ప‌ట్టించుకోవ‌డం లేద‌ని, ప్ర‌త్యేక హోదా విష‌మంలో ఎన్డీఏ చిన్న చూపుచూస్తోంద‌ని రాష్ట్ర‌ప‌తితో వైసీపీ ఎంపీలు పేర్కొన్నారు... కేంద్రం తీసుకున్న నిర్ణ‌యం వ‌ల్ల ఏపీకి అన్యాయం జ‌రుగుతోంద‌ని దీనిపై వెంట‌నే చ‌ర్య‌లు తీసుకోవాల‌ని ఎంపీలు రాష్ట్ర‌ప‌తిని కోరి ఒక విన‌తి ప‌త్రాన్ని స‌మ‌ర్పించిన‌ట్లుగా తెలుస్తోంది.
 
ఆ త‌ర్వాత వైసీపీ ఎంపీ మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ..... గ‌తంలో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక హోదా మాట ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఎత్తితే ఎగతాలి చేసిన ముఖ్య‌మంత్రి... ఇప్పుడు త‌గుదున‌మ్మా అంటూ రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా కావాల్సిందేఅంటూ యూట‌ర్న్ తీసుకుని బీజేపీ మీద విమ‌ర్శ‌లు చేస్తున్నార‌ని మండిప‌డ్డారు మేక‌పాటి.. ప్ర‌త్యేక హోదాకోసం ఆనాటి నుంచి ఈనాటి వ‌ర‌కూ పోరాటం చేస్తున్న ఏకైక వ్య‌క్తి ఒక్క జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి అని మ‌రోసారి గుర్తుచేశారు.... ఇప్ప‌టికిప్పుడు చంద్ర‌బాబు కేంద్రంతో క‌టీఫ్ చేప్పి ప్ర‌త్యేక‌హోదా కావ‌లంటూ త‌మ ఎంపీల‌తో డ్రామాలు చేయిస్తున్నార‌ని మేక‌పాటి మండిప‌డ్డారు.
 
అయితే ఇదే విష‌యంపై వైవి సుబ్బారెడ్డి మాట్లాడుతూ...రాష్ట్ర‌ప‌తిని క‌లిశాక ప్ర‌త్యేక హోదా పై ఆయ‌న‌ సానుకూలంగా స్పందించార‌ని అన్నారు.. రాజ్యాంగాన్ని కాపాడ‌వ‌ల‌సిన వ్య‌క్తి కాబ‌ట్టి రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు త‌ప్ప‌ని స‌రి  న్యాయం చేస్తార‌ని అన్నారు.. దీంతోపాటు పార్ల‌మెంట్ సాక్షిగా ఇచ్చిన హామీలను అమ‌లు చేయాల‌ని తాము రాష్ట్ర‌ప‌తిని కోరామ‌ని సుబ్బారెడ్డి అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.