జ‌గ‌న్ అభినంద‌న‌లు ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-19 12:39:07

జ‌గ‌న్ అభినంద‌న‌లు ?

ప్ర‌జాసంక‌ల్ప‌యాత్ర‌లో వైయ‌స్ జ‌గ‌న్మోహ‌న్ రెడ్డిని ఇటీవ‌ల ప్ర‌త్యేక హూదా సాధ‌న కోసం రాజీనామా చేసిన వైసీపీ ఎంపీలు క‌లిశారు...ప్ర‌త్యేక హూదా కోసం మీరు చేసిన పోరాటం మ‌రువ‌లేనిది అని జ‌గ‌న్ వారికి అభినందించారు.
తెలుగుదేశం ఎంపీలు కూడా రాజీనామా చేసి ఉంటే ఏపీకి ప్ర‌త్యేక హూదా కోసం కేంద్రంపై ఒత్తిడి పెరిగేది అని ఆయ‌న అన్నారు...
 
ప్రత్యేక హోదా కోసం టీడీపీ ఎంపీలతో రాజీనామాలు చేయించకుండా, ఆమరణ దీక్షలో కూర్చోనివ్వకుండా సీఎం చంద్రబాబు ఇప్పుడు దీక్షకు సిద్థం కావటాన్ని కొంగ జపం – దొంగదీక్ష అని వైఎస్సార్‌ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి విమర్శించారు. 
 
రాజీనామాల అంశాన్ని కప్పిపుచ్చడానికే బాబు ఒక్కరోజు దీక్ష చేస్తున్నారు అని ఆయ‌న విమ‌ర్శించారు.చంద్రబాబుది అంతా  వన్‌ డే ఫార్ములా  అని వ్యాఖ్యానించారు..కావాల‌నే వైసీపీని ఎదుర్కోలేక ఇటువంటి రాజ‌కీయాలు చేస్తున్నారు అని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.
 
త‌మ రాజీనామాలు, ఏపీ భ‌వ‌న్ లో దీక్ష‌, అలాగే కేంద్రం పై పోరాటం ఇక రాష్ట్ర‌ప‌తిని క‌లిసి వివ‌రించిన అన్ని అంశాల‌ను ఎంపీలు వైయ‌స్ జ‌గ‌న్ కు తెలియ‌చేశారు.. ఇక బంద్ లో పాల్గొన్న వారిపై కేసులు ఎలా పెడ‌తారంటూ ఎందుకు బెదిరిస్తున్నారు అంటూ ఆయన విమ‌ర్శించారు.... ఈ సమావేశంలో ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వరప్రసాదరావు, వైవీ సుబ్బారెడ్డి, మిథున్‌రెడ్డి, అవినాష్‌రెడ్డి, వి.విజయసాయిరెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డితోపాటు శాసనమండలిలో ప్రతిపక్షనేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, శాసన సభాపక్ష ఉపనేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యన్నారాయణ పాల్గొన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.