వైసీపీ ఎంపీలు రాజీనామా?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-03-08 01:03:20

వైసీపీ ఎంపీలు రాజీనామా?

హ‌స్తిన రాజ‌కీయం వేడెక్కుతోంది.. ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు రాష్ట్రంలో ఎటువంటి ప‌రిస్ధితి త‌లెత్తుతుందో అనే డైల‌మాతో వెంట‌నే కేంద్రంలో మంత్రులుగా కొన‌సాగుతున్న ఇరువురు ఎంపీల‌ను వైదొల‌గాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.. రాజీనామాలు చేయాల‌ని నిర్ణ‌యం వారికి తెలియ‌చేశారు..  రాజ‌స్ధాన్ ప‌ర్య‌ట‌న‌కు వెళుతున్న ప్ర‌ధాని మోదీని క‌లిసి రాజీనామాలు స‌మ‌ర్పించాలి అని ఇరువురు తెలుగుదేశం ఎంపీలు అనుకున్నారు.. అయితే అక్క‌డ ప‌రిస్ధితుల బ‌ట్టీ రాజ‌కీయం జ‌రుగుతుంది అని అంటున్నారు తెలుగుదేశం ఎంపీలు.
 
ఇక ఇటు రాష్ట్రంలో బీజేపీ మంత్రులు కూడా  రాజీనామా చేశారు.. తెలుగుదేశం అధినేత ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబుకు రాజీనామా స‌మ‌ర్పించిన ఇరువురు, త‌మ‌కు తెలుగుద‌శానికి క‌టీఫ్ అని తెలియ‌చేశారు.. ఇక వైసీపీ స‌రికొత్త ఆలోచ‌న‌లో ప‌డింది.. అయితే ఇటు జ‌గ‌న్ మీడియా స‌మావేశంలో తెలియ‌చేసిన విష‌యం.. ఏపీకి ఎటువంటి నిధులు కేంద్రం ఇచ్చిందో వారు  తెలియ‌చేయాలి, వీరు నిజాలు చెప్పాలి అని ఎప్ప‌టి నుంచో ప్ర‌శ్న లేవ‌నెత్తుతోంది.
 
ఇటు జ‌గ‌న్ కూడా త‌న స్టాండ్ తెలిచేశారు.. ఏపీకి ఎవ‌రు ప్ర‌త్యేక హూదా ఇస్తే వారికి తాము స‌పోర్ట్ చేస్తాం అని అన్నారు. ఇక్క‌డ వ‌ర‌కూ బాగానే ఉంది.. మ‌రోసారి జ‌గ‌న్ బాబును ఇరుకున పెట్టారు అనేది ఇక్క‌డ స్ప‌ష్టంగా తెలుస్తోంది. ఇక వైసీపీ త‌ర‌పున అవిశ్వాసం పెడుతున్నాం స‌పోర్ట్ చేయాలి, ఏపీకి సంబంధించిన అంద‌రూ ఎంపీలు క‌లిసి అవిశ్వాసం ప్ర‌వేశ‌పెడితే కేంద్రంలో  చ‌ల‌నం వ‌స్తుంది అని అన్నారు జ‌గ‌న్..
 
అయితే ఇలా చేసినా తాము మ‌ద్ద‌తు జ‌గ‌న్ కు ఇస్తే సింగిల్ టేక్ లో జ‌గ‌న్ కు  క్రెడిట్ వ‌స్తుంది... అస‌లు బాబు ఈ ప్ర‌పోజ‌ల్ ఒప్ప‌కోరు అనేది తెలిసిందే... 40 ఏళ్ల రాజ‌కీయం తలొగ్గిన‌ట్టు ఉంటుంది... అయితే జ‌గ‌న్ కూడా కావాలి అంటే మీరు అవిశ్వాసం  పెట్టండి మ‌ద్ద‌తు ఇస్తా అన్నారు.. కేంద్రం పై అంత పెద్ద ఎత్తున నిర్ణ‌యం తీసుకునే దైర్యం బాబు చేయ‌రు అనేది తేలిపోయింది... మ‌రి టీడీపీ గేటు ఇవ‌త‌ల‌కు వ‌చ్చింది.. ఇటు జ‌గ‌న్ మాత్రం అక్క‌డే ఉన్నారు. త‌న స్టాండ్ మార‌దు అని తెలియ‌చేశారు.
 
ఇటు వైసీపీ ఎంపీలు కూడా రాజీనామా అంటున్నారు.. మొత్తం 25 మంది రాజీనామాలు చేసే ప్ర‌స‌క్తేలేదు..  జ‌గ‌న్ పిలుపుతో  ఐదుగురు ఎంపీలు వైసీపీ త‌ర‌పున ఏప్రిల్ ఆరున రాజీనామా చేస్తాము అన్నారు అది కూడా కేంద్రం ఏపీకి ప్ర‌త్యేక హూదా విష‌యంలో ఎటువంటి ప్ర‌క‌ట‌న చేయ‌క‌పోతే... కాని ఇప్పుడే కేంద్రం ప్ర‌క‌టించింది, కాబ‌ట్టి జ‌గ‌న్ ఆలోచ‌న ఒక‌టే అవిశ్వాస తీర్మానం పెట్టి త‌ర్వాత త‌న పార్టీ ఎంపీల‌ను రాజీనామాలు చేయించాలి అని అనుకుంటున్నారు.
 
అందుకే ఇప్పుడు రాజీనామాలు చేసినా అవిశ్వాసానికి అవ‌కాశం ఉండ‌దు, ఒక‌వేళ సీఎం చంద్ర‌బాబు తాము బ‌య‌ట‌కు వ‌చ్చాం జ‌గ‌న్ ఇంకా ఎంపీ ప‌ద‌వుల‌కు రాజీనామా చేయ‌లేదు అని అంటే?  వెంటనే త‌లెత్తే ప్ర‌శ్న ఒక‌టే, జ‌గన్ చెప్పిన‌ట్లు ఎందుకు అవిశ్వాసానికి ముందుకురావ‌డం లేదు అని అంటారు అంద‌రూ... అందుకే బాబు కూడా జ‌గ‌న్ వేసే స్టెప్స్ బ‌ట్టీ పావులు క‌దుపుతారు.. మొత్తానికి ఇరువురు తీసుకునే నిర్ణ‌యంతో ఈ పార్ల‌మెంట్ స‌మావేశాల్లో ఏదో ఒక‌టి తేలిపోనుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.