బాబు పరిస్థితి ఏంటి.....

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-18 16:34:45

బాబు పరిస్థితి ఏంటి.....

ప్రత్యేక హోదా కోసం నాలుగేళ్ళ నుండి అలుపెరుగని పోరాటం చేస్తుంది వైసీపీ. .. ఇక ఏపీలో వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి యువభేరీలు, బంద్ లు , దీక్షలు చేసి ప్రత్యేక హోదా ఆశలను సజీవంగా ఉంచారు.  వైసీపీ పోరాట పటిమతో ప్రత్యేక హోదా నినాదం ప్రజల్లోకి వెళ్ళింది. ఆ తరవాత జరిగిన పరిణామాల నేపథ్యంలో వైసీపీ కేంద్రంపై పోరాటాన్ని ఉధృతం చేసింది.. కేంద్రం పై  13 సార్లు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి చరిత్ర సృష్టించింది ప్ర‌తిప‌క్ష వైసీపీ.
 
కేంద్రం అవిశ్వాస తీర్మానంపై చర్చకు వెనకడుగు వేయడంతో, ప్రత్యక హోదానే రాష్ట్రానికి ఊపిరి అని భావించిన జగన్ మోహన్ రెడ్డి, తన పార్టీ ఎంపీల చేత రాజీనామా చేయించారు.. ఆ తరువాత వైసీపీ అధినేత అదేశానుసారం ఏపీ భవన్ లో ఆరు రోజులపాటు నిరాహారదీక్ష చేసి పోరాటాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లారు... ఈ పోరాటంతో ప్రత్యేక హోదాపైన వైసీపీకి మాత్రమే చిత్తశుద్ధి ఉందని ప్రజలు నమ్మి తమవంతు మద్దతు తెలిపారు.
 
మరో వైపు టీడీపీ మాత్రం రోజుకో మాట మాట్లాడుతూ ప్రజలను అయోమయంలో పడేసింది.... 2014 ఎన్నికల సమయంలో 10 సంవ‌త్స‌రాల పాటు  ఏపీకి ప్రత్యేక హోదాని తీసుకువస్తా అని చెప్పిన చంద్రబాబు, తర్వాత ప్యాకేజీకి జై కొట్టారు.... ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న వాళ్ళను అరెస్ట్ చేయించ‌డం, ప్రత్యేక హోదా ఏమైనా సంజీవన? ప్రత్యేక హోదాతో ఏమి ఒరగదు అని అనడం...తర్వాత మాట ఫిరాయించి ప్రత్యేక హోదాకి  జై కొట్టడంతో టీడీపీ పైన ప్రజలు నమ్మకాన్ని కోల్పోయారు.. టీడీపీ కేవలం అధికారం కోసమే ఇలా నాటకాలు ఆడుతోందని ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు.
 
ఇప్పుడున్న పరిస్థితులలో వైసీపీ ఎంపీల రాజీనామాలను ఆమోదిస్తే బాబు పరిస్థితి ఏంటని అనుకుంటున్నారు రాజకీయ విశ్లేషకులు... రాజీనామాలు ఆమోదిస్తే ఆరు  నెలల లోపు ఎన్నికలు జరపాలి.. ఈ అయిదు ఎంపీస్ధానాలు వైసీపీకి కంచుకోట..టీడీపీపైన వ్యతిరేకత రోజు రోజుకి పెరిగిపోతుంది.. ఒకవేళ ఎన్నికలు జరిగిన వైసీపీ భారి మెజారిటీతో గెలవడం ఖాయం...అందుకే టీడీపీ డైలమాలో ఉంది.. టీడీపీ నుండి అభ్యర్థులను నిలపెడితే ఓడిపోయడం ఖాయం...ఆ ఎఫెక్ట్ వచ్చే సార్వత్రిక ఎన్నికలలో పడే అవకాశం ఉంది..అందుకే నిలబడితే   పార్టీకి ఎంత ఉపయోగం ఉంటుంది అనేది బేరీజు వేసుకొని  ఆచితూచి అడుగులు వేయాలని ఆలోచిస్తున్నారట బాబు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.