వైసీపీ ఎంపీలు రాజీనామా ఏపీ భ‌వ‌న్ కు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-06 15:16:13

వైసీపీ ఎంపీలు రాజీనామా ఏపీ భ‌వ‌న్ కు

వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అన్న ప‌ని చేసింది... పార్టీ అధినేత  ఏపీ ప్ర‌తిప‌క్ష నేత జ‌గ‌న్మోహ‌న్ రెడ్డి ఇచ్చిన ఆదేశాల మేర‌కు తీసుకున్న నిర్ణ‌యానికి అనుగుణంగా పార్ల‌మెంట్ నిర‌వ‌ధిక వాయిదా ప‌డ‌గానే, వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేస్తాము అని తెలియ‌చేశారు... అదే విధంగా వైసీపీ ఎంపీలు రాజీనామాలు చేశారు.. నేడు లోక్ స‌భ ప్రారంభ‌మై స‌భ జ‌రిగిన వెంట‌నే స‌భ‌ను నిర‌వ‌ధిక వాయిదా వేశారు స్పీక‌ర్ సుమిత్రా మ‌హాజ‌న్.
 
ఇక  ఏపీకి హోదా కల్పించనందుకు నిరసనగా పదవులను వదులుకున్నారు వైసీపీ ఎంపీలు...ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా సాధన పోరాటంలో భాగంగా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీలు తమ పదవులకు రాజీనామాలు చేశారు. పార్లమెంట్‌ నివరధిక వాయిదా పడిన త‌ర్వాత‌ ఎంపీలు స్పీకర్‌ను కలుసుకుని, రాజీనామా పత్రాలను సమర్పించారు. 
 
స్పీకర్‌ ఫార్మాట్‌లో రూపొందించిన రాజీనామాలను పరిశీలించిన సుమిత్రా మహాజన్‌.. నిర్ణయాన్ని పునరాలోచించుకోవాలని వైఎస్సార్‌సీపీ ఎంపీలకు సూచించారు. అందుకు సున్నితంగా తిరస్కరించిన ఎంపీలు.. రాజీనామాలను తక్షణమే ఆమోదించాలని స్పీకర్‌ను కోరారు. రాజీనామాల తర్వాత నేరుగా ఏపీ భవన్‌కు బయలుదేరిన ఎంపీలు నిరవధిక నిరాహార దీక్షలో కూర్చోనున్నారు. ఇప్ప‌టికే ఏపీ భ‌వ‌న్ లో వైసీపీ ఎంపీల‌కు సంఘీభావం ప్ర‌క‌టించేందుకు వైసీపీ నాయ‌కులు పెద్ద ఎత్తున చేరుకున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.