ఆయ‌న రాక‌తో వైసీపీకి ఆ జిల్లాలో స‌రికొత్త జోష్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysrcp
Updated:  2018-07-14 11:12:25

ఆయ‌న రాక‌తో వైసీపీకి ఆ జిల్లాలో స‌రికొత్త జోష్

2019 సార్వ‌త్రిక ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో రాజ‌కీయ‌నాయ‌కులు త‌మ‌ రాజ‌కీయ భ‌విష్య‌త్ ను దృష్టిలో ఉంచుకుని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకునేందుకు రెడి అవుతున్నారు. ఇప్ప‌టికే అధికార తెలుగుదేశం పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కులు య‌ల‌మంచిలి ర‌వి, వసంత కృష్ణ‌ప్ర‌సాద్  వైసీపీ తీర్థం తీసుకున్న సంగ‌తి తెలిసిందే. ఇక వారిలో ఒక‌రు మానుగుంట మ‌హీధ‌ర్ రెడ్డి ఒక‌రు. 
 
ఆయ‌న ఎప్పుడు అయితే వైసీపీ తీర్థం తీసుకున్నారో అప్ప‌టి నుంచి ప్రకాశం జిల్లాలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది. ముఖ్యంగా చేప్పాలంటే ప్ర‌కాశం జిల్లా వ్యాప్తంగా మానుగంట ఫ్యామిలీ త‌ర్వాత‌  దివి శివరాం ఫ్యామిలీకి మంచి ప‌లుకుబ‌డి వుంది. వారి మించి ఇంకేవ్య‌వ‌రు కందుకూరు నియోజ‌క‌వ‌ర్గంలో రాజ‌కీయాలు చేయ‌లేరు. ఒక వేల చేసినా ఎన్నిక‌ల్లో డిపాజిట్లు గ‌ళ్లంతు అవ్వ‌డం ఖాయం అని కందుకూరు గ‌డ్డ‌పై ప్ర‌జ‌లు త‌రుచు అనుకుంటూ ఉంటారు.
 
ఇక తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత  మొద‌టిసారి 2014లో సార్వ‌త్రిక ఎన్నిక‌లు జ‌రిగితే ఆ ఎన్నిక‌ల్లో మానుగంట మ‌హీధ‌ర్ రెడ్డి రాజ‌కీయాల‌కు దూరంగా ఉన్నారు. కుందుకూరులో టీడీపీ త‌ర‌పున పోటీచేసిని అభ్య‌ర్థి దివి శివారంపై వైసీపీ అభ్య‌ర్థి పోతుల రామారావు అత్య‌ధిక మెజార్టీతో గెలిచారు. ఎన్నిక‌లు జ‌రిగిన‌ రెండు సంవ‌త్స‌రాల‌కు మానుగంటముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు స‌మ‌క్షంలో టీడీపీ తీర్థం తీసుకుంటార‌ని, ఆయ‌న పార్టీలో చేరితే మంచి గుర్తింపు కూడా ఇస్తార‌ని వార్త‌లు వ‌చ్చాయి. కానీ మానుగంట టీడీపీలో చేర‌లేదు.
 
విస్వ‌స‌నీయ వ‌ర్గాల స‌మాచారం ప్ర‌కారం మానుగంట టీడీపీలో చేరుతార‌నే వార్త రాకముందు వైఎస్ జ‌గ‌న్ ను క‌లిసి త‌న రాజ‌కీయ భ‌విష‌త్ గురించి వివ‌రించిన‌ట్లు తెలుస్తోంది. ఇక జ‌గ‌న్ కూడా ఆయ‌న విష‌యంలో సానుకూలంగా స్పందించిన‌ట్లు స‌మాచారం. ఇక ఎన్నిక‌లు స‌మీపిస్తున్న‌ త‌రుణంలో మానుగంట త‌ను అనుచ‌రుల‌తో పాద‌యాత్ర చేస్తున్న వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి స‌మ‌క్షంలో వైసీపీ తీర్థం తీసుకున్నారు.
 
నిత్యం ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను తెలుసుకుంటూ వారి స‌మ‌స్య‌ల‌కు ప‌రిస్కారం దొరికేలా చేస్తున్నారు మానుగంట‌. వ్యూహ ప్రతివ్యూహాల్లో ఆయ‌న‌ను మించిన రాజ‌కీయ నాయ‌కుడు లేరంటే న‌మ్మండి. మ‌హీధ‌ర్ రెడ్డి ఏ ప్లాన్ వేస్తే అధి సక్సెస్ అయ్యేవ‌ర‌కు వ‌దిలిపెట్ట‌రు. కందుకూరు అసెంబ్లీ సెగ్మెంట్ ప్రకాశం జిల్లాలోనే ఉన్నాఈ నియోజకవర్గం నెల్లూరు లోక్ సభ సెగ్మెంట్ పరిధిలోకి వస్తోంది. 
 
2014లో వైసీపీ ఎంపీగా పోటీ చేసి గెలిచి ప్ర‌త్యేక హోదా సాధ‌న కోసం రాజీనామా చేసిన మేక‌పాటి రామోహ‌న్ రెడ్డితో కూడా మానుగుంటకు స‌న్నిహిత‌ సంబంధాలు ఉన్నాయి. దీంతో పాటు ప‌క్క‌న ఉన్న నియోజ‌క‌వ‌ర్గాలు అయిన కొండేపి, కనిగిరి నియోజ‌క‌వ‌ర్గాల్లో కొన్ని ప్రాంతాలు మానుగంట‌కు ప‌లుకుబ‌డి ఉంది.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.