ప‌ట్టాలెక్కిన వైసీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-11 17:51:21

ప‌ట్టాలెక్కిన వైసీపీ

ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న ప్ర‌త్యేక‌ హోదాను ప్ర‌క‌టించాలంటూ కేంద్ర వైఖరిని నిర‌సిస్తూ వైసీపీ ఎంపీలు ఢీల్లీలోని ఏపీ భ‌వ‌న్ లో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేప‌ట్టిన సంగ‌తి మ‌నంద‌రికీ తెలిసిందే...ఈ ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష నేటితో ఆర‌వ‌రోజుకు చేరుకుంది... అయితే దీక్షకు దిగిన ఐదుగురు ఎంపీల్లో ముగ్గురి ఆరోగ్యం బాగా క్షీణించడంతో ఇప్పటికే బలవంతంగా ఆసుపత్రికి తరలించారు. యువ ఎంపీలైన పీవీ మిథున్‌రెడ్డి, వైఎస్‌ అవినాష్‌ రెడ్డిని కూడా పోలీసుల సాయంతో ఆస్ప‌త్రికి త‌ర‌లించారు.
 
ఇక తాజాగా వైసీపీ ఎంపీలు చేస్తున్న స‌మ‌ర దీక్ష‌కు రాష్ట్రవ్యాప్తంగా ప్ర‌జ‌లు మ‌ద్ద‌తు తెలుపుతూ ఈరోజు  రైల్ రోకో చేప‌డుతున్నారు...గుంటూరు, చిత్తూరు, నెల్లూరు, ఒంగోలు, విజయనగరం, శ్రీకాకుళం, కర్నూలు తదితర ప్రాంతాల్లో రైలు పట్టాలపైకి చేరిన వైసీపీ కార్యకర్తలు రైళ్లను అడ్డుకున్నారు. గుంతకల్లులో ఓ ప్యాసింజర్ రైలును శివారుల్లోనే వైసీపీ కార్యకర్తలు అడ్డుకోవడంతో రైళ్ల రాకపోకలు నిలిచిపోయాయి. 
 
రాష్ట్ర ప్ర‌యోజ‌నాల‌కోసం వైసీపీ నేత‌లు అలుపెరుగ‌ని పోరాటం చేస్తుంటే అధికార తెలుగు దేశం పార్టీ నాయ‌కులు మాత్రం బ‌స్సుయాత్ర పేరుతో నాట‌కాలు ఆడుతున్నార‌ని ప్రజ‌లు మండిప‌డుతున్నారు... పార్ల‌మెంట్ చివ‌రిరోజున వైసీపీ ఎంపీల‌తో పాటు టీడీపీ ఎంపీలు రాజీనామ చేసివుంటే రాష్ట్రానికి ఇంత గ‌తి ప‌ట్టేది కాద‌ని వైసీపీ కార్య‌క‌ర్త‌లు మండిప‌డుతున్నారు..

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.