టీడీపీ నాయ‌కుల కాళ్ల‌కింద దూరుతా వైసీపీ నేత‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-17 12:10:59

టీడీపీ నాయ‌కుల కాళ్ల‌కింద దూరుతా వైసీపీ నేత‌

అధికార‌ తెలుగుదేశం పార్టీ నాయ‌కులు రాష్ట్రాన్ని అభివృద్ది, ఆరోగ్యం, ఆనందం పేరుతో పెద్ద పెద్ద యాడ్స్ ఇస్తున్నార‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ మండిప‌డ్డారు. ఈ రోజు విశాఖ‌ప‌ట్నంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, టీడీపీ అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంద‌ని ఈ నాలుగు సంవ‌త్స‌రాల్లో రాష్ట్రం ఏవిధంగా అభివృద్ది  చెందిందో ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడుని మీడియా ద్వారా వివ‌రించాల‌ని బొత్స ప్ర‌శ్నించారు.
 
2014లో టీడీపీ అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత ఏపీ అవినీతిలో అభివృద్ది చెందింద‌ని, అలాగే అక్రామాల‌, దోపిడీల‌లో అభివృద్ది చెందింది త‌ప్ప మ‌రేవిధంగా  అభివృద్ది చెందలేద‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు. రాష్ట్ర ప్ర‌జ‌లు ఆనారోగ్యంతో కొట్టు మిట్టాడుతున్నార‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. ఎక్క‌డ చూసిన‌ ప్ర‌జ‌లు విష‌ జ్వ‌రాల‌తో బాధ‌ప‌డుతున్నార‌ని బొత్స గుర్తు చేశారు. 
 
అలాగే డ్వాక్రా మ‌హిళ‌ల‌కు రుణ‌మాఫి చేస్తామ‌ని చెప్పి ఇంత‌వ‌ర‌కు పూర్తి చేయ‌లేద‌ని మండిప‌డ్డారు. గ‌తంలో టీడీపీ నాయ‌కులు మ‌హిళ‌ల అకౌంట్ ల‌లో ప‌దివేల రూపాయ‌ల‌ను జ‌మ‌చేశార‌ని అబ‌ద్దాల‌ను చెప్పార‌ని బొత్స విమ‌ర్శించారు. 
 
రాష్ట్రంలో స్త్రీ అంటే ఒక ప్ర‌త్యేకమైన గౌర‌వం ఉంది. క‌న్న‌త‌ల్లిని తోడ‌పుట్టిన చెల్లికి అన్యాయం చేయ‌కూడ‌దు, అబ‌ద్దం చెప్ప‌కూడ‌దు అని అన్నారు. ఒకవేళ‌ చెబితే చ‌రిత్ర క్ష‌మించ‌ద‌ని బొత్స ఆరోపించారు. అంతేకాదు టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు మ‌హిళ‌ల అకౌంట్ ల‌లో 10వేలు వేసిన‌ట్టు త‌న‌కు చూపిస్తే వారికి నేను త‌ల‌వంచి సాష్టాంగ న‌మ‌స్కారం చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు. అలాగే విద్యార్థుల ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ పై కూడా స్పందించారు బొత్స
 
టీడీపీ అధికారంలోకి వ‌చ్చి నాలుగు సంవ‌త్స‌రాలు మూడు నెలలు అయింద‌ని అయితే ఇంత‌వ‌ర‌కు ఒక్క‌సారి కూడా ఫీజు రీయింబ‌ర్స్ మెంట్ చేయ‌లేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రి అయిన త‌ర్వాత విద్యార్థులు చ‌దువుకోలేని ప‌రిస్థితికి వ‌చ్చార‌ని బొత్స విమ‌ర్శ‌లు చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.