చంద్ర‌బాబుకు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ సూటి ప్ర‌శ్న‌

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp senior leader botsa sathya narayana
Updated:  2018-06-25 15:03:43

చంద్ర‌బాబుకు బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ సూటి ప్ర‌శ్న‌

ప్ర‌తిప‌క్ష‌నేత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నేత బొత్స స‌త్య‌నారాయ‌ణ‌ మ‌రోసారి మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేసి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్ర‌బాబు నాయుడిపై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ, నీతి అయోగ్ స‌మావేశం జ‌రిగి సుమారు తొమ్మిది రోజులను పూర్తి అయింద‌ని, ఈ స‌మావేశం జ‌రుగ‌క ముందు టీడీపీ నాయ‌కులు వారి అనుకూల మీడియాతో త‌మ నాయ‌కుడు డిల్లీకి వెళ్తున్నారని నీతి అయోగ్ స‌మావేశంలో ప్ర‌దాని మోడీని భ‌య‌పెడుతార‌ని ప్రచారం చేశార‌ని బొత్స మండిప‌డ్డారు. 

అయితే తాము ప్ర‌తీ సారి ప్ర‌జ‌లు వివ‌రిస్తూనే ఉన్నామ‌ని కేంద్రంతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు చీక‌టి ఒప్పందాల‌ను కూదుర్చుకున్నార‌ని ఆయ‌న తెలిపారు. చంద్ర‌బాబు నాయుడు నీతి అయోగ్ స‌మావేశంలో ఏపీలో జ‌రుగుతున్న అన్యాయంపై ఏ విధంగా స్పందించారో వివ‌రించాలి బొత్స స‌త్య‌నారాయ‌ణ ప్ర‌శ్నించారు. 

నీతి అయోగ్ స‌మ‌వేశం జ‌రిగి ఈ రోజుటితో తొమ్మిది రోజుల‌ను పూర్తిచేసుకుంద‌ని, అయితే ఇంత‌వ‌ర‌కు టీడీపీ చెందిన నాయ‌కులు కానీ మంత్రులు కానీ మీడియాతో చ‌ర్చించలేద‌ని ఆయ‌న మండిప‌డ్డారు. కేవ‌లం ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు రాజ‌కీయ ల‌బ్దిపొందేందుకు ప్ర‌య‌త్నిస్తురు త‌ప్ప ప్ర‌జా శ్రేయ‌స్సు కోసం పాటు ప‌డ‌ర‌ని బొత్స స‌త్య‌నారాయ‌ణ మండిప‌డ్డారు.

ఇక ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో టీడీపీ నాయ‌క‌లు డ్రామాలు ఆడుతూ క‌డ‌ప ఉక్కు అనే పేర‌తో దొంగ దీక్ష‌లు చేస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు. వైసీపీ నేత‌లు నాలుగు సంవ‌త్స‌రాలుగా క‌డ‌ప ఉక్కు, రైల్వే జోన్, పోల‌వ‌రం ప్రాజెక్ట్ పూర్తి చేయాల‌ని కేంద్రంతో పోరాడుతూనే ఉంద‌ని స్ప‌ష్టం చేశారు. అయితే టీడీపీ నాయ‌కుల బీజేపీతో మిత్ర‌ప‌క్షంగా ఉన్న‌ప్పుడు విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల ఎందుకు అడ‌గ‌లేక‌పోతున్నార‌ని బొత్స ప్ర‌శ్నించారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.