న‌వ‌ర‌త్నాల టీడీపీ దొంగ‌లు వీరే వైసీపీ

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-08 17:35:19

న‌వ‌ర‌త్నాల టీడీపీ దొంగ‌లు వీరే వైసీపీ

విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా రైల్వేజోన్, అలాగే క‌డ‌ప ఉక్కు పరిశ్ర‌మ‌ల విష‌యంలో నాలుగు సంవ‌త్స‌రాల నుంచి కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఏ విధంగా వంచించాయే అందరికి తెలిసిందే. అయితే అందుకు వ్య‌తిరేకంగా రేపు మ‌రోసారి వంచ‌న‌పై గ‌ర్జ‌న‌ దీక్ష చేప‌ట్ట‌బోతున్నామ‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్  పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు బొత్స స‌త్య‌నారాయ‌ణ తెలిపారు.
 
ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ రేపు గుంటూరు జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలు మాజీ ఎంపీలు, పార్టీ నాయ‌కులు కార్య‌క‌ర్త‌లం క‌లిసి ఉద‌యం తొమ్మిది గంట‌ల నుంచి సాయంత్రం 4 గంట‌ల వ‌ర‌కు వంచ‌న‌పై గ‌ర్జ‌న దీక్ష చేప‌ట్ట‌బోతున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
 
అంతేకాదు రాష్ట్రంలో క‌రువు తాండ‌వం చేస్తోంద‌ని సుమారు 400 మండ‌లాలు క‌రువుతో అల్లాడుతున్నాయ‌ని ఆయ‌న తెలిపారు. అయితే ప్ర‌భుత్వ నాయ‌కుల‌కు రైతు క‌ష్టాలు ప‌ట్ట‌కున్నాయ‌ని బొత్స మండిప‌డ్డారు. ఇక వీట‌న్నింటిని ప్ర‌స్తావిస్తూ త‌మ నాయ‌కుడు 2019 ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌స్తే అమ‌లు చేయ‌బోయే న‌వ‌ర‌త్నాల‌ను వివ‌రిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పాద‌యాత్ర చేస్తుంటే మ‌రోవైపు అధికార బ‌లంతో జ‌గ‌న్ న‌వ‌ర‌త్నాల‌కు దీటుగా తెలుగుదేశంపార్టీ నాయ‌కులు అవినీతికి పాల్ప‌డుతున్నార‌ని బొత్స మండిప‌డ్డారు.
 
అందులో మొద‌టి వ్య‌క్తి గురజాల ఉన్న య‌ర‌ప‌తినేని శ్రీనివాస్. ఆయ‌న జిల్లాలో విచ్చ‌ల‌విడిగా మైనింగ్ అక్ర‌మాల‌కు పాల్ప‌డుతున్నార‌ని కానీ ప్ర‌భుత్వం ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేద‌ని బొత్స ఆరోపించారు  య‌ర‌ప‌తినేని న‌వ‌ర‌త్నాల్లో ఒక ర‌త్నం అని ఆరోపించారు. ఇక రెండ‌వ ర‌త్నం పెద‌కురుపాడు శాస‌న‌స‌భ్యులు శ్రీధ‌ర్. ఈయ‌న విచ్చ‌ల‌విడిగ రోజుకు వేల కోట్లు అక్ర‌మంగా దోచుకుంటున్నార‌ని మండిప‌డ్డారు. ఇక మూడ‌వ ర‌త్నం పొన్నురూ శాస‌న‌సభ్యులు న‌రేంద్ర అని ఈయ‌న ఎక్క‌డ చెరువు క‌నిపించినా, ఖాళీ స్థలం క‌నిపించినా అదినాది అని అక్ర‌మంగా దోచుకుంటున్నార‌ని బొత్స ఆరోపించారు. 
 
ఇక ఇదే నియోజ‌క‌వ‌ర్గానికి చెందిన ఇంకొక అవినీతి ర‌త్నం ఉంద‌ని ఆ ర‌త్నం పేరు ఆంజినేయులు. ఈయ‌న ప్ర‌భుత్వ స‌బ్సీడిలు ఏ విధంగా వ‌స్తాయా వాటిని ఏవిధంగా దోచుకుందామా అని ఎదురు చూస్తార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. టీడీపీకి చెందిన అమ‌రో అవినీతి ర‌త్నం స‌త్య‌ప్ర‌సాద్ అని ఈయ‌న ఎక్కడ చూసినా కూడా సెటిల్ మెంట్ లు చేస్తార‌ని ఎక్క‌డ ప్ర‌భుత్వ భూమి క‌నిపిస్తే అక్క‌డ స‌త్య‌ప్ర‌సాద్ గ‌ద్ద‌లా వాలిపోతార‌ని బొత్స విమ‌ర్శించారు. ఇక జిల్లాలో ఉన్న ఇంకో అవినీతి ర‌త్నం తెనాలి రాజేంద్ర ప్ర‌సాద్ ఈయ‌న ప్ర‌జ‌లకు సేవ‌లు చేసేందుకు రాలేద‌ని సెటిల్మెంట్లు చేసేందుకు వ‌చ్చార‌ని బొత్స‌ మండిప‌డ్డారు. 
 
ఇక జిల్లాలో ఇద్ద‌రు మంత్రులు, కోడెల శిప్ర‌సాద్‌ ఈ అవినీతి ర‌త్నాల్లో ఉన్న త్రిమూర్త‌లని బొత్స తీవ్ర స్థాయిలో విమర్శ‌లు చేశారు. ఇక వేమూరి శాస‌న‌సభ్య‌లు అనంద్ బాబు అయితే ఎక్క‌డ క్రైస్త‌వ సోసైటీలు క‌నిపిస్తే వాటిని ఆక్ర‌మించుకుంటున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అలాగే చిల‌క‌లూరి పేట స‌త్తెన‌ప‌ల్లి నియోజ‌క‌వ‌ర్గాల ఎమ్మెల్యేలు పుల్లారావు, శివ‌ప్ర‌సాద్ వీరిద్ద‌రు బాస్ ల‌ని పంచ‌భూతాల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా తినేస్తార‌ని బొత్స మండిప‌డ్డారు. ఈ అవినీతి న‌వ‌ర‌త్నాల వ‌ల్ల జిల్లాలో శాంతి భ‌ద్ర‌త‌లు లేకుండా పోతుంద‌ని ఆయ‌న విమ‌ర్శ‌లు చేశారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.