బీజేపీ టీడీపీ నాయ‌క‌లుపై వైసీపీ నేత ఫైర్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-06 18:29:31

బీజేపీ టీడీపీ నాయ‌క‌లుపై వైసీపీ నేత ఫైర్

నిన్న విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన అంశాల పై భార‌తీయ జ‌న‌తా పార్టీ నాయ‌కులు సుప్రీం కోర్టుకు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ ను చూసి ఏపీ ప్ర‌జ‌లు ర‌గిలిపోతున్నార‌ని ప్ర‌తిప‌క్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సీనియ‌ర్ నాయ‌కుడు పార్థ‌సార‌థి తెలిపారు. ఈ రోజు పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ, కేంద్రానికి ప్ర‌జాస్వామ్య వ్య‌వ‌స్థ మీద‌, నైతిక‌తమీద‌, అలాగే పార్ల‌మెంట్ వ్య‌వ‌స్థ‌మీద ఏ మేర‌కు గౌర‌వం ఉందో వారు స‌మ‌ర్పించిన అఫిడ‌విట్ లో తెలిసిపోయింద‌ని పార్థ‌సార‌థి ఆరోపించారు.
 
ఏ రాజ‌కీయ నాయ‌కుడు కూడా పార్ల‌మెంట్ వ్య‌వ‌స్థ‌ను గౌవ‌ర‌వించ‌క‌పోతే త‌గిన ఫ‌లితాన్ని అనుభ‌వించాల్సి వ‌స్తుంద‌ని, అలాగే ఆ పార్టీకి పుట్ట‌గ‌తులు ఉండ‌వ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. గంత‌లో బీజేపీ నాయ‌కులు విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న అంశాల‌ను తాము అమ‌లు చేశామ‌ని మీడియా ద్వారా చెప్పారో ఇప్పుడు ఇదే విష‌యాన్ని కోర్టులో అఫిడ‌విట్ ద్వారా అమ‌లు చేశార‌ని పార్థ‌సార‌థి మండిప‌డ్డారు. అలాగే ఈ విష‌యాన్ని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ కూడా పార్ల‌మెంట్ లోప‌ల పార్ల‌మెంట్ బ‌య‌ట చెప్పుకొచ్చార‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
 
ఇక ఈ విష‌యంపై ఏపీ అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు మీడియా ముందు బాద‌ప‌డుతున్నా లోప‌ల మాత్రం హ్యాపీగా ఉన్నార‌ని పార్ధసార‌థి ఎద్దేవా చేశారు. కేవ‌లం వారు చేసిన త‌ప్పును క‌ప్పిపుచ్చుకునేందుకు టీడీపీ నాయ‌కులు ఇది ఒక అస్త్రంగా భావిస్తున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కేంద్రంతో నాలుగు సంవ‌త్స‌రాలు మిత్ర‌ప‌క్షం వ్య‌వ‌హ‌రించిన‌ప్పుడు ఇదే విష‌యాల‌ను కేంద్రం ఆయ‌న‌కు చెప్పింద‌ని, అయితే ఇప్పుడ ఇదే విష‌యాన్ని మ‌రోసారి కేంద్రం అఫిడ‌విట్ ద్వారా చెప్పింద‌ని ఆరోపించారు. గ‌తంలో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ప్ర‌త్యేక హోదా ముగిసిపోయిన అధ్యాయ‌నం అన్నారో ఇప్పుడు ఇదే విష‌యాన్ని బీజేపీ నాయ‌కులు చెబుతున్నార‌ని పార్థ‌సార‌థి మండిప‌డ్డారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.