వైసీపీ సంచలన ప్రకటన పార్ల‌మెంట్?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ysrcp mps
Updated:  2018-03-28 02:11:55

వైసీపీ సంచలన ప్రకటన పార్ల‌మెంట్?

రాష్ట్రంలో ప్ర‌త్యేక హూదా పోరు ప‌తాక స్ధాయికి చేరింది.. ఇటు పార్ల‌మెంట్  లో కేంద్రం పై అవిశ్వాసం పెడుతుంటే చ‌ర్చ‌కు రాకుండానే వెన‌క్కి వెళుతోంది.. ఎనిమిది రోజులుగా అదే విధానం పార్ల‌మెంట్ల్ లో జ‌రుగుతోంది... ఇక స‌భ‌లో చ‌ర్చ జ‌రుప‌కుండానే స‌భ‌ను వాయిదా వేస్తున్నారు.. దీంతో వైసీపీ నాయ‌కులు నేడు స‌భ వాయిదా ప‌డిన స‌మ‌యంలో ఫైర్ అయ్యారు.
 
ఈ విధంగా పార్లమెంట్ నిరవధిక వాయిదా పడితే తాము రాజీనామాలకు సిద్ధంగా ఉన్నామని ఎంపీలు ప్రకటించారు. స్పీకర్ ఫార్మాట్‌లో సిద్ధం చేసిన పత్రాలను ఆ పార్టీ ఎంపీ వరప్రసాద్ మీడియాకు చూపించారు. సభలో మాట్లాడేందుకు అవకాశం ఇవ్వకుండా బీజేపీ అన్యాయం చేస్తోందని ఆయన తీవ్రస్థాయిలో విమ‌ర్శ‌లు చేశారు.
 
రాష్ట్రంలో ఉన్న‌టువంటి ప‌రిస్ధితుల‌ను అర్ధం చేసుకోవ‌ల‌సిన  బాధ్య‌త బీజేపీకి ఉంది అని ఆయ‌న అన్నారు.. తెలుగువారికి ఇచ్చిన హామీ నెర‌వేర్చాలి అని వైసీపీ ప్ర‌శ్నించింది.రాష్ట్ర విభజన సమయంలో ఏపీకి పదేళ్లు ప్రత్యేక హోదా ఇవ్వాలని ప్రస్తుత ఉపరాష్ట్రపతిగా ఉన్న వెంకయ్యనాయుడు ఆనాడు యూపీఏ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారని, అలాగే ఎన్నికల సమయంలో నరేంద్రమోదీ తిరుపతి ప్రచార సభలో మాట్లాడుతూ ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని, విభజన హామీలు నెరవేరుస్తామని వెంకన్న సాక్షిగా హామీ ఇచ్చి మాట తప్పారని వరప్రసాద్ ఆరోపించారు. ఇలా హామీ ఇచ్చి ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేయ‌డం మంచిది కాదు అని ఆయ‌న విమ‌ర్శించారు.
 
ఇక సోమ‌వ‌రానికి స‌భ వాయిదా వేసారు స్పీక‌ర్.. అయితే మ‌రో ఐదురోజులు మాత్ర‌మే స‌మావేశాలు జ‌రుగ‌నున్నాయి.. ఈ స‌మ‌యంలో స‌భ‌లో అవిశ్వాసానికి సంబంధించి చర్చ జ‌రుగుతుందా బీజేపీ త‌న స్టాండ్ మార్చుకుంటుందా అనేది చూడాలి. ఇక స‌భ‌ను నిర‌వ‌ధిక వాయిదా వేసే ఆలోచ‌న‌లో కూడా బీజేపీ ఉంద‌నే సంకేతాలు వినిపిస్తున్నాయి.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.