వైసీపీ కీల‌క నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-07 15:40:55

వైసీపీ కీల‌క నిర్ణ‌యం

తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత విభ‌జ‌న చ‌ట్టంలో పొందుప‌రిచిన ప్ర‌త్యేక హోదా, విశాఖ రైల్వేజోన్, అలాగే క‌డ‌ప ఉక్కు ప‌రిశ్రమల‌ను కేంద్రం ప్ర‌క‌టించ‌ని కార‌ణంగా ప్ర‌తిపక్ష‌ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు సంచ‌ల‌న నిర్ణయం తీసుకున్నారు. త‌ర్వ‌లో జ‌రగ‌బోతున్న రాజ్య‌స‌భ డిప్యూటీ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో భార‌తీయ జ‌న‌తా పార్టీకి, అలాగే దాని మిత్రప‌క్షాల పార్టీల‌కు వ్య‌తిరేకంగా ఓటు వేస్తామ‌ని విజ‌య‌సాయిరెడ్డి మ‌రోసారి స్ప‌ష్టం చేశారు.
 
ఈ సంద‌ర్భంగా ఆయ‌న జాతీయ మీడియాతో మాట్లాడుతూ విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న ప్ర‌త్యేక హోదాను ఏ పార్టీ అయితే ప్ర‌క‌టిస్తుందో ఆ పార్టీకే తాము మ‌ద్ద‌తు ఇస్తామ‌ని, అయితే ప్ర‌త్యేక హోదా ప్ర‌క‌టించ‌కుండా ఏపీ ప్ర‌జ‌ల‌ను మోసం చేసిన ఎన్డీఏకు తాము మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని విజ‌య‌సాయి రెడ్డి స్ప‌ష్టం చేశారు. 
 
అంతేకాదు త‌ర్వ‌లో జ‌ర‌గ‌బోతున్న రాజ్య‌సభ చైర్మ‌న్ ఎన్నిక‌ల్లో బీజేపీకి వ్య‌తిరేకంగా తాము ఓటు వేస్తామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. నాలుగు సంవ‌త్స‌రాలుగా ఏపీకి ప్ర‌త్యేక హోదాను ఇస్తామ‌ని చెప్పి ఇవ్వ‌కుండా కేంద్రం మోసం చేసింద‌ని ఆయ‌న మండిప‌డ్డారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.