ఈ నెల 9న వైసీపీ మ‌రో కీల‌క నిర్ణ‌యం

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-08-02 03:34:55

ఈ నెల 9న వైసీపీ మ‌రో కీల‌క నిర్ణ‌యం

తెలుగు రాష్ట్రాలు విభ‌జ‌న జ‌రిగిన త‌ర్వాత విభ‌జ‌న చ‌ట్టంలో పోందుప‌రిచిన ప్రత్యేక హోదా కోసం మొద‌టి నుంచి ప్ర‌తిపక్ష‌ వైసీపీ పోరాటం చేస్తుంద‌ని ఆ పార్టీ సీనియ‌ర్ నాయ‌కులు ఉమారెడ్డి వెంక‌టేశ్వ‌ర్లు అన్నారు. ఈ రోజు పార్టీ కార్యాలాయంలో ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో ఆయ‌న మాట్లాడుతూ డీల్లీ నుంచి గ‌ల్లీ దాగా నిర‌స‌న‌లు చేస్తూ ప్ర‌త్యేక హోదా కోసం కేంద్రం పై ఒత్తిడి తెచ్చిన ఘ‌నత వైసీపీకే ద‌క్కుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 
 
అంతేకాదు గ‌తంలో త‌మ పార్టీ నాయ‌కుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి ఆదేశాల మేర‌కు వైసీపీ ఎంపీలు అవిశాష్ రెడ్డి, మిథున్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వ‌ర‌ప్ర‌సాద్ రావు, మేక‌పాటి రాజ‌మోహ‌న్ రెడ్డిలు త‌మ ప‌ద‌వుల‌ను సైతం లెక్క‌చేయ‌కుండా రాజీనామాచేసి ఏపీ భ‌వ‌న్ లో నిరాహార దీక్ష‌ చేశార‌ని ఆయ‌న అన్నారు. అయితే ప్ర‌త్యేక హోదా కోసం అధికార తెలుగుదేశం పార్టీ నాయ‌కులు ఒక్క‌సారి కూడా దీక్ష‌లు చేయ్య‌లేద‌ని ఉమారెడ్డి ఆరోపించారు. ఇప్పుడు ఎన్నిక‌లు ద‌గ్గ‌ర‌కు వ‌స్తున్న త‌రుణంలో బీజేపీకి విడాకులు ఇచ్చి వారు చేసిన త‌ప్పును క‌ప్పిపుచ్చుకునే కార్య‌క్ర‌మంలో భాగంగా ప్ర‌త్యేక హోదా ఉద్య‌మం చేస్తున్నార‌ని ఉమారెడ్డి మండిప‌డ్డారు.
 
ఇటీవ‌లే వైసీపీ నాయ‌కులు కేంద్ర రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు వ్య‌తిరేకంగా బంద్ కు పిలుపునిస్తే అక్ర‌మంగా చంద్ర‌బాబు నాయుడు పోలీస్ అధికారుల‌తో అరెస్ట్ చేయించార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. అయితే వీట‌న్నింటికి వ్య‌తిరేకంగా మ‌రోసారి వైసీపీ నాయ‌కులు ఈ నెల 9వ తేదిన గుంటూరు జిల్లాలో వంచ‌న‌పై గ‌ర్జ‌న దీక్ష చేస్తున్నామ‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు.
 
కాగా గ‌తంలో మాజీ ముఖ్య‌మంత్రి తెలుగుదేశం పార్టీ వ్య‌వ‌స్థాప‌కుడు నంద‌మూరి తార‌క‌ రామారావు కాంగ్రెస్ పార్టీకి వ్య‌తిరేకంగా పార్టీని స్థాపిస్తే ఇప్పుడు ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు కాంగ్రెస్ పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ని ఆయ‌న ఆరోపించారు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.