విజ‌య‌సాయిరెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

ycp mp vijaya sai reddy image 1
Updated:  2018-03-10 11:33:18

విజ‌య‌సాయిరెడ్డి కీల‌క ప్ర‌క‌ట‌న

మొత్తానికి  ఆంధ్రప్ర‌దేశ్ రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారుతున్నాయి... తెలుగు రాష్ట్రాల విభ‌జ‌న అనంత‌రం విభ‌జ‌న చ‌ట్టంలో పేర్కొన్న హామీలు ప్ర‌త్యేక హోదా, విశాఖ రైల్వే జోన్ వంటి అంశాల‌ను కేంద్రం ప్ర‌క‌టించ‌కపోవ‌డంతో  ప్ర‌తిప‌క్ష, మిత్ర ప‌క్షాలు రాష్ట్ర వ్యాప్తంగా ధ‌ర్నాలు చేప‌డుతున్నాయి... కాగా మ‌రోవైపు ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి తాను చేప‌ట్టిన ప్ర‌జా సంల్ప యాత్రలో అధికార టీడీపీ నాయ‌కులు చేస్తున్న అవినీతి అరాచ‌కాల‌ను ఎండ‌గ‌డుతూ ముందుకు వెళుతున్నారు, దీంతో పాటు రాష్ట్రానికి ప్ర‌త్యేక హోదా ఎంత అవ‌స‌ర‌మో ప్ర‌జ‌ల‌కు వివ‌రిస్తూ సంక‌ల్ప యాత్ర‌లో ముందుకు సాగుతున్నారు జ‌గ‌న్.
 
ఈ నేప‌థ్యంలో వైసీపీ ఎంపీ విజ‌య సాయి రెడ్డి ప్ర‌త్యేక హోదాపై జాతీయ మీడియాతో మాట్లాడారు... త‌మ‌కు బీజేపీ అన్నా, ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోడీ అన్నా అపారమైన‌ న‌మ్మ‌కం ఉంద‌ని ఆయ‌న తెలియ‌చేశారు.. ఏపీకి ప్ర‌త్యేక హోదా త‌ప్ప‌ని స‌రిగా బీజేపీ  ప్ర‌క‌టిస్తుంద‌ని విజ‌య సాయి రెడ్డి తెలిపారు... ఇదే విష‌యాన్ని త‌మ నాయ‌కుడు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి వెల్ల‌డించార‌ని ఆయ‌న మీడియాకు తెలియ‌చేశారు... ఏపీలో త‌మ పార్టీ విధానాలు చాలా స్ప‌ష్టంగా ఉన్నాయ‌ని ఈన్నారు...  దీంతో పాటు కేంద్రంపై అవిశ్వాసం త‌ప్ప‌నిస‌రి పెట్టి తీరుతామని తెలిపారు.
 
అయితే మ‌రో వైపు తాము అధికారంలోకి రాగానే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చినా  ఆ పార్టీకి తాము మ‌ద్ద‌తు ఇవ్వ‌మ‌ని విజ‌య సాయి రెడ్డి తెలిపారు..  కాంగ్రెస్ పార్టీకి కొంచెం  కూడా చిత్తశుద్ధి లేదని, అందుకే  ఆ పార్టీని నమ్మలేమని పేర్కొన్నారు. బీజేపీ మాత్రమే హోదా ఇవ్వగలదని, మోదీ తమ డిమాండ్‌ను అంగీకరిస్తారన్న నమ్మకం ఉందని ఎంపీ వివరించారు..హోదా ఇస్తామన్న వారితో కలిసి నడవడమే తమ విధానమని, ఈ విషయాన్ని జగన్ స్పష్టంగా పేర్కొన్నారని విజ‌య‌సాయి రెడ్డి  స్పష్టం చేశారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.