గౌతం రెడ్డి రీ ఎంట్రీ ?

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-14 18:33:33

గౌతం రెడ్డి రీ ఎంట్రీ ?

వంగ‌వీటి రంగా పై అనుచిత వ్యాఖ్య‌లు చేసి పార్టీ నుంచి స‌స్పెండ్ అయ్యారు విజ‌యవాడ వైసీపీ నేత గౌత‌మ్  రెడ్డి. ఇక కాపుల మ‌నోభావాలు గౌతమ్ రెడ్డి  దెబ్బ తీశార‌ని కాపులు తీవ్రంగా వ్య‌తిరేక‌త చూపారు.. దీంతో పార్టీ నుంచి అత‌న్ని బ‌హిష్క‌రించారు, అయితే త‌ర్వాత మ‌రో ఇంట‌ర్వ్యూలో తాను రంగా పై  అనుచితంగా మాట్లాడ‌లేదు అని తెలియ‌చేసినా ఆయన గోడు ప‌ట్టించుకోలేదు... ఇక జ‌గ‌న్ పాద‌యాత్ర‌లో కూడా ఆయ‌న పాల్గొన‌డం విజ‌య‌వాడ రాజ‌కీయాల్లోపెద్ద చ‌ర్చ‌కు దారి తీసింది. 
 
అయితే ఆయ‌న క్ష‌మాప‌ణ చెప్ప‌డం జ‌రిగిన దానిపై రాద్దాంతం చేయ‌ద్దు అని అన‌డంతో, ఇప్పుడు వైసీపీ నేత‌లు చ‌ర్చ‌లు జ‌రిపి ఆయ‌న పై వేసిన స‌స్పెన్ష‌న్ ఎత్తివేశారు... ఇక స‌స్పెన్ష‌న్ ఎత్తి వేయ‌డంతో ఆయ‌న జ‌గ‌న్ని పాద‌యాత్ర‌లో క‌లిశారు... జ‌గ‌న్ తో కలిసి పాద‌యాత్ర‌లో క‌దం తొక్కారు.
 
పైగా గౌతంరెడ్డి పై స‌స్పెన్ష‌న్ పార్టీ త‌రుపున ఆయ‌న్ని చ‌ర్చ‌ల‌కు పిల‌వ‌ద్దు అని ప్ర‌క‌ట‌న చేశారు.. ఇప్పుడు మ‌ళ్లీ పార్టీలోకి తీసుకోవ‌డం ప‌ట్ల‌, ఓ సందిగ్ద‌త ఉన్నా ఆయ‌న పార్టీలోకి రావ‌డానికి ప్ర‌య‌త్నం ఫ‌లించింది అని తెలుస్తుంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.