టార్గెట్ 175

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-05-08 11:32:36

టార్గెట్ 175

వ‌చ్చే ఎన్నిక‌ల్లో  ఏపీలో 175 సీట్లు గెలుపే ల‌క్ష్యంగా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ ముందుకు వెళుతోంది...   వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి వ‌చ్చేఎన్నిక‌ల‌కు ఇప్ప‌టి నుంచే సిద్దం కావాలి అని  పిలుపునిచ్చారు...ఇందుకు బూత్‌ కమిటీల పాత్ర కీలకమన్నారు. వైఎస్సార్‌సీపీ బూత్‌ కమిటీలకు రెండు రోజుల రాజకీయ శిక్షణ తరగతులు కర్నూలులో ప్రారంభమయ్యాయి.. 
 
మొదటిరోజు కర్నూలు పార్లమెంటు పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు చెందిన బూత్‌ కమిటీలకు శిక్షణ తరగతులను కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య అధ్యక్షతన నిర్వహించారు... ప్రత్యేక హోదా అంశం సజీవంగా ఉండేందుకు కారణం వైఎస్‌ జగన్‌ అని సజ్జల స్పష్టం చేశారు.... చంద్ర‌బాబు ప‌రిపాల‌న గురించి ప్ర‌జ‌లు అంద‌రికి తెలియాలి అని, బూత్‌ కమిటీలు నిరంతరం కష్టపడాలని సజ్జల సూచించారు.  
 
అధికార టీడీపీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టిన అధికారుల జాబితాను తయారు చేయాలని సూచించారు.... అన్ని పథకాల్లో అధికార పార్టీ నేతలు అవినీతికి పాల్పడుతున్నారని, వాటిని మనం అధికారంలోకి వచ్చిన తర్వాత వడ్డీతో సహా కక్కిద్దామని స్పష్టం చేశారు.... జ‌గ‌న్ కు సీఎం కావాలి అని కోరిక ఉండి ఉంటే కాంగ్రెస్ చెప్పిన‌ట్టు విని కాంగ్రెస్ లోనే కొన‌సాగేవారు అని తెలియ‌చేశారు.
 
ఎన్నికల్లో బూత్‌ కమిటీలు కీలకపాత్ర పోషిస్తాయని శాసనమండలి ప్రతిపక్ష నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు అన్నారు. చెప్పిన మాట మీద నిలబడే గొప్ప వ్యక్తిత్వం జగన్‌మోహన్‌ రెడ్డిది అని పార్టీ జిల్లా కో–ఆర్డినేటర్‌ మేకపాటి గౌతంరెడ్డి అన్నారు. జిల్లాలో 14 ఎమ్మెల్యే సీట్లు, 2 ఎంపీ సీట్లు గెలుపొంది జగనన్నకు కానుకగా ఇద్దామని పిలుపునిచ్చారు. 
 
ఎన్నికల్లో సోషల్‌ మీడియా పాత్ర ఎంతో కీలకంగా మారిందని ఐటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు చల్లామధుసూదన్‌రెడ్డి తెలిపారు. విలువలు గల రాజకీయం జగన్‌కే చెల్లిందని, ఆయన చెప్పడం వల్లే ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశానని నంద్యాల పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు శిల్పా చక్రపాణిరెడ్డి తెలిపారు.. జిల్లా వైయ‌స్సార్ కాంగ్రెస్ పార్టీ నాయ‌కులు పెద్ద ఎత్తున ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొన్నారు, వ‌చ్చే ఎన్నిక‌ల‌ను టార్గెట్ గా పెట్టుకుని ముందుకు వెళ్లాల‌ని పిలుపునిచ్చారు వైసీపీ నాయ‌కులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.