విజ‌య‌వాడ వైసీపీలో దూసుకుపోయేదెవ‌రు

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-07-06 14:55:31

విజ‌య‌వాడ వైసీపీలో దూసుకుపోయేదెవ‌రు

వైసీపీలో సీట్ల చిచ్చు రానుందా,  పార్టీలో టిక్కెట్ల ర‌చ్చ జ‌రుగుతుందా ఇదే తెలుగుదేశం తాజాగా ఆలోచ‌న చేస్తోంది...  ప‌ది నెల‌ల స‌మ‌యం ఉంది ఎన్నిక‌ల‌కు, ఈ లోగా వైసీపీ లో విజ‌యవాడ రాజ‌కీయాలు ఎలా మార‌బోతున్నాయి.. గ‌త ఎన్నిక‌ల్లో విజ‌యవాడ‌లో తూర్పు నుంచి గ‌ద్దె రామ్మోహ‌న్ విజ‌యం సాధించారు..ఇటు సెంట్ర‌ల్ లో బోండా ఉమ విజ‌యం సాదించారు..ఇక ప‌శ్చిమ నుంచి జ‌లీల్ ఖాన్ వైసీపీ త‌ర‌పున విజ‌యం సాదించారు..అయితే తెలుగుదేశం అదికారంలోకి రావ‌డంతో ఇక్క‌డ మంత్రి ప‌ద‌వి ఆశించి వైసీపీ నుంచి జ‌లీల్ ఖాన్ తెలుగుదేశంలోకి చేరిపోయారు.. పార్టీ ఫిరాయింపు అనే ట్యాగ్ లైన్ తగిలించుకున్నారు.
 
ఇక్కడ వెల్లంప‌ల్లి వైసీపీ త‌ర‌పున యాక్టీవ్ గా ఉన్నారు. ముఖ్యంగా మైనార్టీ వైశ్య-కాపుల-బ్రాహ్మ‌ణ ఓటు బ్యాంకు వెల్లంప‌ల్లికి ప్ల‌స్ అవ‌నుంది.. ఇటు తెలుగుదేశం త‌ర‌పున జ‌లీల్ ఖాన్ కు సీటు ఇస్తారా లేదా ఆయ‌న కుమార్తె ఎన్నిక‌ల బ‌రిలో దిగుతారా అనేది చూడాలి.. లేక‌పోతే పెన‌మ‌లూరు నుంచి బోడెప్ర‌సాద్ ఇక్క‌డ పోటీ చేసే ఆలోచ‌న‌లో ఉన్నారు దీని వెనుక కార‌ణం పెన‌మ‌లూరులో లోకేష్ ని ఎమ్మెల్యే అభ్య‌ర్దిగా నిల‌బెట్టాలి అని ఆలోచ‌న‌.
 
ఇక విజ‌య‌వాడ సెంట్ర‌ల్లో అస‌లైన రాజ‌కీయం జ‌రుగుతోంది.. ఇక్క‌డ వైసీపీ త‌ర‌పున మ‌ల్లాది విష్ణు, గౌతం రెడ్డి , వంగ‌వీటి రాధా వీరు ముగ్గురు రాజ‌కీయంగా మంచి బ‌లమైన నేత‌లే.. ఇటు ఇటీవ‌ల కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరారు కాబ‌ట్టి వైసీపీ త‌ర‌పున మ‌ల్లాదికి సీటు ఇవ్వ‌రు అనే వార్త‌లు వినిపిస్తున్నాయి ఇటు గౌతం రెడ్డి కాపుల‌కు కాస్త దూరం అయ్యారు. ఆయ‌న పార్టీలో మ‌ళ్లీ యాక్టీవ్ అయినా మ‌చ్చ అలాగే ఉంది అని అంటున్నారు వంగ‌వీటి రంగా అభిమానులు. ఇటు తెలుగుదేశం మాత్రం బోండా ఉమాకు సీటు ఇచ్చేందుకు సిద్దంగా ఉంది.. ఇక ఇక్క‌డ వైసీపీ త‌ర‌పున టికెట్ ఎవ‌రికి అనేది జ‌గ‌న్ ఫైన‌ల్ చేయాలి.
 
ఇటు తూర్పు ఎమ్మెల్యేగా గ‌ద్దె రామ్మోహ‌న్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో త‌న‌కే సీటు అని ధీమాగా ఉన్నారు.. ఇటు తెలుగుదేశం రామ్మోహ‌న్ కు సీటు ఇచ్చేలా ఫైన‌ల్ స‌ర్వే కూడా చేసింద‌ట.. అయితే వైసీపీ త‌ర‌పున య‌ల‌మంచిలి ర‌వి తూర్పు నుంచి వైసీపీ త‌ర‌పున నిల‌బ‌డే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి.. అయితే ఈ హామీతో వైసీపీలో ఆయ‌న చేరారు అనేది తెలిసిందే.
 
ఇక ఇప్పుడు ఎటువంటి లుక‌లుక‌లు లేక‌పోయినా, పార్టీ ఎన్నిక‌ల్లో టిక్కెట్లు ఇచ్చే స‌మ‌యంలో ఎటువంటి ప్లాన్ వేస్తారు అనేది ఆలోచ‌న‌గా ఉంది..ముఖ్యంగా రాధా, మ‌ల్లాది విష్ణు,గౌతం రెడ్డి వీరి టికెట్ల విష‌యంలో ఇంకా క్లారిటీ రావాలి.. జ‌గ‌న్ కు క్లారిటీ ఉంది, ఇక నేత‌ల‌కు మాత్ర‌మే క్లారిటీ రావాలి.

షేర్ :

Comments

1 Comment

  1. 100% Radha ke echady seat.

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.