గొట్టిపాటికి పోటీగా వైకాపా సీనియ‌ర్ నేత

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-02-05 10:34:55

గొట్టిపాటికి పోటీగా వైకాపా సీనియ‌ర్ నేత

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు మ‌రో  కొత్త వార్త తెర‌పైకి వ‌చ్చింది. 2019 ఎన్నిక‌ల్లో వైకాపా గుర్తుపై గెలిచి అధికార పార్టీలోకి జంప్ అయిన ఫిరాయింపు ఎమ్మెల్యేల‌పై  వైయ‌స్ జ‌గ‌న్ స్పెష‌ల్  ఫోక‌స్ పెట్టిన‌ట్లు తెలుస్తోంది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఫిరాయిపుల‌ను బుద్ది చెప్పేందుకు  ప‌క్కా ప్ర‌ణాళిక‌ల‌ను ర‌చిస్తున్నారు.
 
ఇందులో భాగంగానే ఫిరాయింపులు జ‌రిగిన నియోజ‌క‌వ‌ర్గాలో ఈ సారి బ‌ల‌మైన, న‌మ్మ‌క‌మైన అభ్య‌ర్ధుల‌ను బ‌రిలో దించనున్నారు. ఈ క్ర‌మంలో అద్దంకి నియోజ‌క‌ర్గం నుండి వైసీపీ గుర్తుపై గెలిచి అధికార పార్టీలోకి ఫిరాయించిన గొట్టిపాటి ర‌వి కుమార్ ను వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఓడించేందుకు వైకాపా నుండి సీనియ‌ర్ నేత బ‌రిలో దిగ‌నున్నార‌ని తెలుస్తోంది. 
 
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి బంధువు, ఎంపీ వైవీ సుబ్బా రెడ్డి ఈ సారి ఎమ్మెల్యేగా అద్దంకి నుండి పోటీ చేస్తార‌నే వార్త‌లు ఇప్పుడు తెర‌పైకి వ‌స్తున్నాయి. ఒంగోల్ ఎంపీగా ఉన్న సుబ్బా రెడ్డి వైసీపీలో సీనియ‌ర్ నాయ‌కుడిగా, రాజ‌కీయ సల‌హాదారుడిగా కొన‌సాగుతున్నారు. 
 
వ‌చ్చే ఎన్నిక‌ల్లో సుబ్బా రెడ్డి అద్దంకి నుండి పోటీ చేసి మంత్రిగా బాధ్య‌తలు స్వీక‌రించే దిశ‌గా వైసీపీ క‌స‌ర‌త్తులు చేస్తోంది. సుబ్బా రెడ్డి ఎమ్మెల్యేగా పోటీ చేయాల‌ని కోరుతూ సోష‌ల్ మీడియాలో కూడా  వైసీపీ అభిమానులు ప్ర‌చారం చేస్తున్నారు. మ‌రి ఇందులో నిజ‌మెంత అనేది తెలియాలంటే మ‌రి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే. 
 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.