బీజేపీ తో వైసీపీకి పొత్తా - వైవీ కామెంట్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

Updated:  2018-04-05 16:08:17

బీజేపీ తో వైసీపీకి పొత్తా - వైవీ కామెంట్

ప్ర‌జ‌లకు ఉన్న‌టువంటి  స‌మ‌స్య‌ల‌ను, దృష్టిలో ఉంచుకుని అన్ని విధాలుగా ఆలోచ‌న చేసి వాటి ప‌రిష్కారానికి మార్గం చూపేదానినే రాజ‌కీయం అని అంటారు. 2014లో కొత్త‌గా ఏర్పాటైన ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రం అనేక స‌మ‌స్య‌లను ఎదుర్కుంటోంది.ఈ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి అప్ప‌టి యూపియే స‌ర్కారు ప్ర‌త్యేక‌హోదా, విభ‌జ‌న చ‌ట్టంలోని అంశాల‌ను అమ‌లు చేస్తామ‌ని హామీల‌ను ప్ర‌క‌టించింది.
 
రాష్ట్ర విభ‌జ‌న త‌ర్వాత‌ జ‌రిగిన ఎన్నిక‌ల‌లో టీడీపీ-బీజేపీ మిత్ర‌ప‌క్షంగా పోటీ  చేసి విజ‌యం సాధించాయి.రాష్ట్రానికి అమ‌లు చేయాల్సిన  హామీల‌ను ఎన్డీయే కేంద్ర ప్ర‌భుత్వం పూర్తిగా విస్మ‌రించింది. ఎన్నిక‌ల సంద‌ర్బంగా కేంద్రం ప్ర‌క‌టించిన హామీల‌ను సాధించుకోవ‌డంలో తెలుగుదేశం స‌ర్కార్ ఘోరంగా విఫ‌ల‌మైంది.
 
 
రాష్ట్రానికి ఉన్న స‌మ‌స్య‌లు తోలిగిపోవాలంటే కేవ‌లం ప్ర‌త్యేక‌హోదా రావాలి అని గ్ర‌హించిన వైసీపీ నాలుగేళ్లుగా నిర్విరామంగా పోరాటం చేస్తోంది. ప్ర‌స్తుతం జ‌రుగుతున్న పార్ల‌మెంట్ స‌మావేశాల్లో కేంద్రానికి వ్య‌తిరేకంగా అవిశ్వాస‌ తీర్మానం పెట్టారు వైసీపీ ఎంపీలు.... పార్ల‌మెంట్ చివ‌రి రోజున కేంద్రం ప్ర‌త్యేక‌హోదా ప్ర‌క‌టించ‌క‌పోతే ఎంపీలు రాజీనామా చేసి దిల్లీలో ఉన్న ఏపీ భ‌వ‌న్‌లో ఆమ‌ర‌ణ నిరాహార దీక్ష చేస్తార‌ని ఇప్ప‌టికే వైయ‌స్ జ‌గ‌న్ ప్ర‌క‌టించారు. 
 
వైసీపీ పోత్తు రాజ‌కీయాలకు పాల్ప‌డుతోంద‌ని టీడీపీ నాయ‌కులు చేసిన అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌ల‌కు వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి స్పందించారు.. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి  ఇతర పార్టీలతోనూ పొత్తు పెట్టుకోవాలనే ఆలోచన లేదని ఎంపీ వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. ప్రత్యేక హోదా సాధించే వరకూ పార్టీ చేస్తున్న పోరాటం ఆగదని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే ఆయన నిజాయితీపరుడని నిరూపించుకోవాలని అన్నారు.
 
సభను అదుపు చేయాల్సిన బాధ్యత స్పీకర్‌, ప్రభుత్వానిదేనని చెప్పారు. ప్రస్తుత పార్లమెంటులో నడుస్తున్న పరిస్థితి మునుపెన్నడూ చూడలేదని అన్నారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబుకు చిత్తశుధ్ది లేదని విమర్శించారు.  ప్రత్యేక హోదాపై అందరం కలసి పోరాటం చేద్దామని తెలిపినా.. చంద్రబాబు మాత్రం రాజకీయ ప్రయోజనాల కోసమే ఆలోచ‌న చేస్తున్నారని ఆయ‌న  ఆరోపించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.