బీజేపీ మంత్రికి బాపిరాజు సంచ‌ల‌న స‌వాల్

Breaking News

హోమ్        ఆంధ్రప్రదేశ్      న్యూస్

bjp-minister-tdp-leaders
Updated:  2018-02-24 12:57:12

బీజేపీ మంత్రికి బాపిరాజు సంచ‌ల‌న స‌వాల్

కేంద్ర‌ప్ర‌భుత్వం ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ లో  ఆంధ్ర‌ప్ర‌దేశ్ కు తీర‌ని అన్యాయం జ‌రిగిన విష‌యం అంద‌రికి తెలిసిందే... దీంతో మిత్ర పక్ష టీడీపీ, బీజేపీ నేత‌ల మ‌ధ్య మాట‌ల యుద్ధం నానాటికీ సాగుతూనే ఉంది... ఈ నేప‌థ్యంలో హోదాకు స‌రిప‌డ  బ‌డ్జెట్ ను కేంద్రం ప్ర‌క‌టించినా దానిని అమలు చేసే విధానంలో టీడీపీ ప్ర‌భుత్వం విఫ‌ల‌మైంద‌ని బీజేపీ నేత‌లు మండిప‌డుతున్నారు.. అయితే మ‌రోవైపు విభ‌జ‌న‌ చ‌ట్టంలో పేర్కొన్న‌ హామీల‌ను కేంద్రం తుంగలో తొక్కిందంటూ అధికార  టీడీపీ నాయ‌కులు, రాష్ట్ర‌వ్యాప్తంగా నిర‌స‌న‌లు తెలుపుతూ కేంద్రం పై మాట‌ల తూటాలు పేల్చుతున్నారు.
 
అయితే తాజాగా  మ‌రోసారి ప‌శ్చిమ‌గోదావరి జెడ్పీ చైర్మ‌న్ ముళ్ల‌పూడి బాపిరాజు బీజేపీ మంత్రి మాణిక్యాలరావు పై త‌న‌దైన శైలిలో విమ‌ర్శ‌లు చేశారు... ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆరుగోల గ్రామంలో జ‌రిగిన నీరు-చెట్టు కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ... మాణిక్యాలరావు  నియోజ‌క వ‌ర్గంలో ప్ర‌జ‌లు ఆయ‌న‌ను పిచ్చోడ‌ని అంటున్నార‌ని, అలాగే తాను అవినీతికి  పాల్పడినట్లు  మాణిక్యాలరావు నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమని సవాల్‌ విసిరారు బాపిరాజు.
 
మంత్రి గారి అనుచ‌రుల వల్లే ఇంత అవినీతి జ‌రుగుతోంద‌ని అన్నారు... నిట్ కు సంబంధించిన శంకుస్థాప‌న స‌మ‌యంలో వేసిన శిలాఫ‌ల‌కం మిన‌హా ఇస్తే,  ఇంత‌వ‌ర‌కు త‌న నియోజ‌క వ‌ర్గంలో ఎలాంటి అభివృద్ధి జ‌ర‌గ‌లేద‌ని బాపిరాజు ఆరోపించారు... అందులో భాగంగానే తాడేప‌ల్లిగూడెం ప‌రిస‌రాల మండ‌లాల్లో జ‌రిగిన అభివృద్ధి కార్య‌క్ర‌మాలు దేశంలో మ‌రెక్క‌డ జ‌ర‌గ‌లేద‌ని అన్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.