విద్య‌- వైద్య‌- పారిశ్రామిక‌రంగంలో మోదీ బ‌డ్జెట్ హైలెట్స్

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

Updated:  2018-02-01 04:47:04

విద్య‌- వైద్య‌- పారిశ్రామిక‌రంగంలో మోదీ బ‌డ్జెట్ హైలెట్స్

మోదీ ప్ర‌వేశ‌పెట్టిన బ‌డ్జెట్ పై దేశంలో అంద‌రూ హర్షం వ్య‌క్తం చేస్తున్నారు... బీజేపీకి ఇది చివ‌రి బ‌డ్జెట్ కావ‌డంతో దేశీయంగా అనేక ప‌థ‌కాల‌పై కొత్త నిర్ణ‌యాల‌కు ఆవిష్క‌ర‌ణ‌ల‌కు మోదీ స‌ర్కార్  ముందు అడుగువేసింది. దేశీయంగా ప‌లు సంస్క‌ర‌ణ‌ల‌కు మోదీ శ్రీకారం చుట్టారు అని తెలిపారు అరుణ్ జైట్లీ... ఇటు విప‌క్షాల విమర్శ‌ల‌ను ప‌క్క‌న పెట్టి ఆయ‌న కొత్త ప‌థ‌కాల‌కు మార్గం సుగుమం చేశారు. తాజాగా బ‌డ్జెట్ లో విద్య వైద్య పారిశ్రామిక రంగాల్లో కొత్త విధానాలు ఆవిష్క‌ర‌ణ‌లు కేటాయింపుల వివ‌రాలు స‌వివ‌రంగా.. 
 
!! విద్యారంగం  !!
విద్యారంగంలో మౌలిక అభివృద్ధికి రూ.లక్షకోట్లతో నిధి
కొత్తగా 18 ఆర్కిటెక్చర్‌ కాలేజీల ఏర్పాటు
డిజిటల్‌ విద్యావిధానానికి మరింత చేయూత
విద్యాభివృద్ధి కోసం జిల్లా కేంద్రంగా ప్రణాళిక
ఈ ఏడాది నుంచి పీఆర్‌ఎఫ్ ‌(ప్రధానమంత్రి రిసెర్చ్‌ ఫెలోషిప్‌). టాప్‌ వెయ్యి మంది బీటెక్‌ విద్యార్థులకు ఫెలోషిప్‌లు
గ్రూప్‌ సీ, డీలలో ఇంటర్వ్యూలను ఇప్పటికే రద్దు చేశాం
 
!! వైద్య రంగం !!
ఆరోగ్య రంగానికి భారీగా నిధులు. రూ.లక్షా 38 వేల కోట్లు కేటాయింపు
ప్రపంచంలోనే అతి పెద్ద జాతీయ ఆరోగ్య భద్రతా పథకం.. పది కోట్ల కుటుంబాలకు లబ్ధి
ఆయుష్మాన్‌ భవ పథకంతో అందరికీ ఆరోగ్యం
ఆయుష్మాన్‌ భవ పథకం కింద ఒక్కో కుటుంబానికి రూ.5లక్షల వరకు హెల్త్‌ కవరేజి. రూ.330 చెల్లిస్తే కుటుంబానికి ఆరోగ్య బీమా
జీవన ప్రమాణ పెంపునకు పైలెట్‌ ప్రాజెక్టు కింద 116 జిల్లాలు ఎంపిక
ఇప్పటికే ఉన్న జిల్లా ఆస్పత్రులను మెడికల్‌ కాలేజీలుగా అభివృద్ధి
టీబీ పేషెంట్ల సరంక్షణకు రూ.670 కోట్లతో ప్రత్యేక నిధి
టీబీ రోగులకు వైద్యం సమయంలో పౌష్టికాహారానికి నెలకు రూ.500
కొత్తగా 24 మెడికల్‌ కాలేజీలకు అనుమతి
ప్రతి మూడు పార్లమెంటరీ స్థానాలకు కలిపి కనీసం ఒక మెడికల్‌ కాలేజీ ఏర్పాటు
 
!!పారిశ్రామిక రంగానికి !!
చిన్న మధ్య తరగతి పరిశ్రమలకు రూ.3794 కోట్లు
పరిశ్రమలకు ఆన్‌లైన్‌ ద్వారా మరిన్ని రుణాలు
పరిశ్రమలకు ఆధార్‌ తరహా మరో కార్డులు
జౌళి రంగానికి రూ.7148 కోట్లు
కార్పోరేట్‌ పన్ను 2శాతం తగ్గింపు
వచ్చే మూడేళ్లకుగాను భవిష్యనిధికి 12శాతం నిధులు చెల్లింపు
పట్టణాలకు..అమృత్‌ ప్రోగ్రాం కింద 500 నగరాలకు నీటి సరఫరా. 
ఇప్పటికే 494 కాంట్రాక్టులకోసం రూ. 19,428 కోట్లు కేటాయింపులు
10 ప్రముఖ పర్యాటక ప్రాంతాలు గుర్తించి వాటిని మరింత అభివృద్ధి చేయనున్నాం
భారత్‌ మాల ప్రాజెక్టులో భాగంగా 9 వేల కిలోమీటర్ల జాతీయ రహదారులు పూర్తి చేస్తాం
దేశ వ్యాప్తంగా స్మార్ట్‌ సిటీల కింద 99 నగరాలు ఎంపిక. రెండు లక్షల కోట్లు కేటాయింపు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.