తెలంగాణ నిరుద్యోగులకు డీజీపీ గుడ్ న్యూస్

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

Updated:  2018-01-20 09:50:46

తెలంగాణ నిరుద్యోగులకు డీజీపీ గుడ్ న్యూస్

తెలంగాణలో  నిరుద్యోగుల‌కు  మ‌రో శుభ‌వార్త అందింది. కేసిఆర్ స‌ర్కార్ ఇప్ప‌టికే ప‌లు ఉద్యాగాల భ‌ర్తీకి  నోటిఫికేష‌న్ విడుద‌ల చేసిన విష‌యం అంద‌రికీ తెలిసిందే. ఈ క్ర‌మంలో   నిరుద్యోగుల‌కు  డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి తీపి క‌బురు అందించారు.

రాష్ట్ర‌మంతటా ఒకే త‌ర‌హా పోలీసింగ్ వ్య‌వ‌స్ధ‌ను తీసుకురానున్నామని, పీపుల్ ఫ్రెండ్లీ పోలీసింగ్ అమ‌లు చేస్తున్నామ‌ని డిజీపీ తెలిపారు. దీంతోపాటు త్వ‌రలో 18 వేల పోలీసు ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ రిలీజ్ చేయ‌నున్నామ‌ని ఆయ‌న ప్ర‌క‌టించారు. 

డీజీపీ మ‌హేంద‌ర్ రెడ్డి ప్ర‌క‌ట‌న‌పై నిరుద్యోగులు హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు. తెలంగాణ‌లో ప్ర‌భుత్వ ఉద్యోగాల‌తో పాటు వివిధ కంపెనీల స్దాప‌న ద్వారా  ప్రైవేట్ ఉద్యోగాలు మ‌రిన్ని క‌ల్పించేందుకు  టీఆర్ ఎస్ ప్ర‌భుత్వం తీవ్ర ప్ర‌య‌త్నాలు కొన‌సాగిస్తూనే ఉంది.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.