నీర‌వ్ మోదీ జాడ తెలిసింది?

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

Updated:  2018-02-20 04:23:37

నీర‌వ్ మోదీ జాడ తెలిసింది?

బ్యాంకులకు వేల కోట్ల రూపాయ‌లు ఎగ‌నామం పెట్ట‌డం, విదేశాల‌కు ఎగిరిపోవ‌డం చాలా  తేలిక అయిపోయింది మ‌న‌దేశంలో వ్యాపార‌వేత్త‌ల‌కు.. ఇప్ప‌టికే విజ‌య్ మాల్యాని భార‌త్ తీసుకురావ‌డానికి ఎన్నో ఇబ్బందులు ప‌డుతోంది మ‌న స‌ర్కార్.. అలాంటిది మ‌రో కుంభ‌కోణం ఇటీవ‌ల పీఎస్ యూ స‌ర్కిల్స్ లో షాక్ గు గురిచేసింది.
 
పంజాబ్ నేష‌న‌ల్ బ్యాంకులో భారీ కుంభ‌కోణం వెలుగులోకి రావ‌డం తెలిసిందే... ఈ కుంభ‌కోణానికి  పాల్ప‌డిన వ‌జ్రాల వ్యాపార వేత్త నీర‌వ్ మోదీ దేశం విడిచి పారిపోయాడు... ప్ర‌స్తుతం ఈయ‌న‌ విదేశాల‌లో ద‌ర్జాగా తిరుగుతున్న‌ట్లు తెలుస్తోంది... అయితే ఇప్ప‌టికే అధికారులు నీర‌వ్ కుంభ‌కోణానికి  సంబంధించి 13 ప్రాంతాల‌లో త‌నిఖీలు చేశారు... కాని అత‌ను నివ‌సిస్తున్న‌టు వంటి ముంబయ్ లో అత‌ని ఆఫీస్ నివాసాల్లో  సీబీఐ అధికారులు కానీ, పోలీసులు కానీ త‌నిఖీలు చేయ‌లేద‌ని తెలుస్తోంది...
 
దీంతో నీరవ్‌ మోదీ విదేశాలకు పారిపోవడం, అధికారులు అత‌ని ఇంటిని త‌నిఖీ చేయ‌కపోవ‌డం ఇదంతా  అధికారులు, ప్రభుత్వ నిర్లక్ష్యమ‌ని కొట్టుచ్చినట్టు కనిపిస్తోందని ఆరోపణలు వ‌స్తున్నాయి.
 
అయితే తాజా స‌మాచారం ప్ర‌కారం నీర‌వ్ ఆయ‌న బృందం దుబాయ్ కు చేరుకున్న‌ట్లు తెలుస్తోంది... వారిని ఎలాగైనా అక్క‌డి నుంచి ర‌ప్పించేందుకు తీవ్ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు అధికారులు... అయితే విదేశాల్లో ఉన్న అత‌నిని భార‌త్ కు ర‌ప్పించాలంటే కొన్ని నియ‌మ నిబంధ‌న‌లు పాటించాలి.
 
దేశంలో ఎవ‌రైనా నేరాల‌కు పాల్ప‌డి విదేశాల‌లో త‌ల దాచుకున్న‌ట్లైతే, 1962 నేర‌స్దుల చ‌ట్టం ప్ర‌కారం ...నేరం ఋజువు అయితే, వారిని ఆ దేశంలో అరెస్ట్ చేసి, వారిని  సొంత దేశానికి  పంపిచవ‌ల‌సి ఉంటుంది.. కానీ ఈ ప్ర‌క్రియ‌ను పాటించ వ‌ల‌సిన కేంద్ర‌మే ప‌ట్టించుకోకపోవ‌డంపై అనుమానాలు రేకెత్తుతున్నాయి.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.