పేటీఎం కొత్త బిజినెస్ యాప్‌

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

Updated:  2018-01-23 02:33:50

పేటీఎం కొత్త బిజినెస్ యాప్‌

ప్ర‌ముఖ డిజిటల్ పేమెంట్స్ సంస్ద పేటీఎం దేశీయ ఆన్ లైన్ మార్కెట్లో దూసుకుపోతోంది.. ఇక ఇప్ప‌టికే డిజిట‌ల్ లావాదేవీల‌లో దేశంలో పేటీఎం అగ్ర‌గామిగా ఉంది.. ఇక తాజాగా చిన్న మ‌ధ్య‌త‌ర‌హా వ్యాపారస్తుల కోసం పేటీఎం బిజినెస్ అనే కొత్త‌యాప్ ను మార్కెట్లోకి తీసుకువ‌చ్చింది పేటీఎం సంస్ద‌.                      
 
ఈ యాప్ ఆండ్రాయిడ్  ప్లేస్టోర్‌లో అందుబాటులో ఉంది...ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకొని వ్యాపారస్థులు లాగిన్‌ అయితే వారికి పేటీఎం క్యూఆర్‌ కోడ్‌ వస్తుంది... దీని ద్వారా వారు డిజిటల్‌ పేమెంట్లను స్వీకరించవచ్చు.. తాజాగా ప్రవేశ పెట్టిన పేటీఎం ఫర్‌ బిజినెస్  యాప్‌ ద్వారా రోజు వారీ వ్యాపార కార్యకలాపాలను మరింత సులభంగా నిర్వహించుకోవచ్చని పేటీఎం సీఓఓ కిరణ్‌ వాసిరెడ్డి  ఒ ప్ర‌క‌ట‌న‌లో తెలియ‌చేశారు.
 
ప్రముఖ మెసేజింగ్‌ యాప్‌ వాట్సాప్‌ తమ వినియోగదారుల కోసం ప్రత్యేక యాప్‌ వాట్సాప్‌ పేను తీసుకువస్తామని ప్రకటించిన నేపథ్యంలో పేటీఎం ఈ అప్లికేషన్‌ను తీసుకువచ్చింది....పది ప్రాంతీయ భాషల్లో అందుబాటులో ఉండే ఈ యాప్‌ ద్వారా వ్యాపారస్థులు  ఎక్కువ  పేమెంట్లను ఎలాంటి రుసుములు లేకుండా నేరుగా బ్యాంకు ఖాతాల ద్వారా నిర్వహించుకోవచ్చు అని  తెలియ‌చేశారు.. ఇక డిజిట‌ల్ పేమెంట్ల చెల్లింపుల్లో కొత్త కొత్త ఆవిష్క‌ర‌ణ‌లు చేయ‌డానికి కంపెనీలు రెడీ అవుతున్నాయి అని మార్కెట్లో నిపుణులు చర్చించుకుంటున్నారు.
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.