రద్దు అయిన పెద్ద నోట్లను ఏం చేస్తున్నారో తెలుసా?

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

Updated:  2018-01-20 09:47:58

రద్దు అయిన పెద్ద నోట్లను ఏం చేస్తున్నారో తెలుసా?

ఏడాది క్రితం పెద్ద నోట్ల ర‌ద్దుతో ఓ సంచ‌ల‌నం క్రియేట్ అయింది మ‌న దేశంలో... పెద్ద ఎత్తున న‌ల్ల‌ధ‌నం బ‌య‌ట‌ప‌డుతుంది అని అంద‌రూ అనుకున్నారు.. చివ‌రకు జ‌రిగిన పరిస్ధితి ఏమిటో తెలిసిందే, త‌ర్వాత కొత్త 500 నోట్లు రెండువేల రూపాయ‌ల నోట్లు విడుద‌ల చేసింది ఆర్బీఐ.. త‌ర్వాత  పాత ర‌ద్దైన  నోట్ల‌ను బ్యాంకుల ద్వారా సేక‌రించింది ఆర్బీఐ.. దీంతో ఈ  నోట్లు ట‌న్నుల కొద్ది పేరుకుపోయాయి ఆర్బీఐ ద‌గ్గ‌ర‌.

ఇప్పుటు ఈ నోట్ల‌ను అన్నింటిని స్టేష‌న‌రీగా మారుస్తున్నారు.. ఈ పాత నోట్ల‌ను కాల్చ‌కుండా ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో స్టేష‌న‌రీగా త‌యారుచేస్తున్నారు..ఈ ప‌నిని బ‌య‌ట‌వారికి ఎవ‌రికి అప్ప‌చెప్ప‌కుండా, ఉపాధి కూడా క‌ల్పిస్తున్నారు. 

తాజాగా తమిళనాడులోని పుజల్‌ సెంట్రల్‌ జైలులో జీవిత ఖైదు అనుభవిస్తున్న సుమారు 25-30 మంది ఖైదీలు రోజూ ఇక్కడ పాత నోట్లతో  ఫైల్‌ ప్యాడ్స్ తయారు చేస్తున్నారు... ఇక‌ పాత నోట్లు ఇప్పుడు ప్ర‌భుత్వ కార్యాల‌యాల్లో ఫైల్స్ గా క‌నిపించ‌నున్నాయి... ఈ జైలు నుంచి సుమారు రోజుకి 1000 ఫైల్‌ ప్యాడ్లు త‌యారు చేస్తున్నారు ఖైదీలు.. ఈ ప‌నికి గానూ

రోజుకు రూ. 160 నుంచి 200 వరకూ ఆర్జిస్తున్నారు ఖైదీలు. ఇప్ప‌టిటి వ‌ర‌కూ   తొమ్మిది ట‌న్నుల  పెద్ద నోట్లు ఇక్క‌డ‌కు పంప‌డం జ‌రిగింది.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.