ఐఫోన్ ఎక్స్‌కు ఇక సెలవ్

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

Updated:  2018-02-15 05:20:54

ఐఫోన్ ఎక్స్‌కు ఇక సెలవ్

యాపిల్ ఐఫోన్ ఎక్స్ ఉత్ప‌తిని  నిలిపివేయ‌నున‌ట్లు  త‌యారీ సంస్థ వెల్ల‌డించింది. ఐఫోన్ ఎక్స్‌ను మొత్తం 62 మిలియన్ యూనిట్లను విక్రయించాలని లక్ష్యంగా పెట్టుకున్న యాపిల్ ఈ ఏడాది మధ్య నాటికి వాటి ఉత్పత్తిని ఆపేయనున్నట్లు సంబంధిత అధికారి మింగ్-చి కుయో తెలిపారు.
 
అయితే ఈ స్థానంలో నూత‌నంగా మూడు స్మార్ట్‌ఫోన్లు ఆవిష్క‌రించ‌నున్నారు. ఐఫోన్ ఎక్స్ స్థానంలో రానున్న కొత్త‌ ఫోన్లు 6.5 అంగుళాల ఓఎల్ఈడీ డిస్‌ప్లే, 6.1 అంగుళాల ఎల్‌సీడీ డిస్‌ప్లే మోడళ్లలో రూపొందించ‌నున‌ట్లు సమాచారం. ఈ మూడు ఫోన్లలోకు కొత్త ఫీచర్ ఫేస్‌ ఐడీ అందుబాటులో ఉంటుంద‌ని చెబుతున్నారు. 
 
కొత్త ఫోన్ల ధ‌ర అంద‌రికి అందుబాటులో ఉండ‌డం వ‌ల్ల,  ఈ ఫోన్ల విక్ర‌యాలు ఏకంగా పదికోట్ల యూనిట్లు దాటాల‌ని యాపిల్‌ లక్ష్యం పెట్టుకున్నట్లు తైవాన్‌కు చెందిన బిజినెస్ గ్రూప్ కేజీఐ సెక్యూరిటీస్ తెలిపింది. 6.1 ఇంచ్ ఐఫోన్‌లో డ్యూయల్ కెమెరా కానీ 3డీ టచ్ కానీ ఉండవని సమాచారం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.