బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్ రేపు భార‌త్ తో ఢీ

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

cricket
Updated:  2018-09-27 10:47:50

బంగ్లాదేశ్ చేతిలో చిత్తుగా ఓడిన పాక్ రేపు భార‌త్ తో ఢీ

ఆసీయా క‌ప్ చివ‌రి సూప‌ప్ హోర్ మ్యాచ్ లో పాకిస్థాన్ ఒత్తిడితో చిత్తు అయింది. బంగ్లాదేశ్ తో జ‌రిగిన మ్యాచ్ లో 240 ప‌రుగుల టార్గెట్ ను పాక్ చేదించ‌లేక‌పోయింది. 50 ఓవ‌ర్ల‌ల‌లో 9 వికెట్లకు పాక్ 202 ప‌రుగుల మాత్ర‌మే చేయ‌గ‌లిగింది. దీంతో బంగ్లాదేశ్ 37 పరుగుల‌తో విజయాన్ని సాధించి ఫైన‌ల్ కు చేరుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్ 239 ప‌రుగులు చేసి ఆలౌట్ అయింది. ఇన్నింగ్స్ ఆరంభంలోనే వికెట్లు కోల్పోయి క‌ష్టాల్లో ప‌డ్డ బంగ్లాదేశ్ ను ర‌హీమ్ ఆదుకున్నాడు. 
 
మ‌హ‌మ్మ‌ద్ మిథున్ తో క‌లిసి ఇన్నింగ్స్ ను చ‌క్క‌దిద్దాడు. ఓ ద‌శ‌లో 12 ప‌రుగుల‌కే మూడు వికెట్లు కోల్పోయిన బంగ్లాదేశ్ ఆ స‌మ‌యంలో ర‌హీమ్, మ‌హ‌మ్మ‌ద్ మిథున్ ఆచి తూచి ఆడారు. క్రీజ్ లో నిల‌దొక్కుకున్నాక త‌మ జోరును చూపించారు. 4వ వికెట్ కు 144 భాగ‌స్వామ్యం అందించారు. ముస్భుక‌ర్ సెంచ‌రితో చ‌ల‌రేగ‌గా మ‌హ‌మ్మ‌ద్ మిథున్ ఆఫ్ సెంచ‌రి చేశాడు. 240 ప‌రుగుల టార్గెట్ తో భ‌రిలోకి దిగిన పాక్ ఒత్తిడికి గురిఅయి మ్యాచ్ ను బంగ్లాదేశ్ కు స‌మ‌ర్పించుకుంది.
 
పాక్ జ‌ట్టులో ఇమామ్ ఒక్క‌డే 83 ప‌రుగులతో ఒంటరి పోరాటం చేశాడు. సీనియ‌ర్ బ్యాట్స్ మెన్ సోయ‌బ్ మాలిఖ్ 30 ప‌రుగుల ఆసీఖ్ అలి 31 పురుగులు చేసినా జ‌ట్టును గెలుపు బాటు ప‌ట్టించ‌లేక పోయారు. ఇక మిగిలిని ఆట‌గాళ్లు ఘోరంగా విఫ‌లం అయ్యారు. దీంతో 202 ప‌రుగుల‌ను మాత్ర‌మే పాక్ చెయ‌గ‌లిగింది. బంగ్లా బౌల‌ర్ల‌లో రెహ‌మాన్ 4 వికెట్లు తీశాడు. రేపు ఆసియా క‌ప్ ఫైన‌ల్లో  టీమిడియాతో బంగ్లాదేశ్ త‌ల‌బ‌డ‌నుంది. అయితే ఇప్ప‌టికే ఒక్క‌సారి బంగ్లాదేశ్ ను ఓడించిన భార‌త్ అదే రిజల్ట్ ను  పున‌రావృతం చేసి ఆసియా క‌ప్ ను సొంతం చేసుకోవాల‌నుకుంటుంది.  

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.