బిట్ కాయిన్ బంద్‌

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

Updated:  2018-02-01 05:12:29

బిట్ కాయిన్ బంద్‌

క‌రెన్సీ ఏదేశంలోనైనా నార్మ‌ల్... కాని ఇప్పుడు ప్ర‌పంచ వ్యాప్తంగా డిజిట‌ల్ క‌రెన్సీ హవా న‌డుస్తోంది... అలాగే ఈ సందులోకి వ‌స్తోంది మ‌రో క‌రెన్సీ అదే క్రిప్టో క‌రెన్సీ... ఈ న‌వీన ప్ర‌పంచంలో క్రిప్టో కరెన్సీ హ‌వా కొన‌సాగుతోంది. అయితే గ‌త కొంత కాలంగా భార‌త దేశంలో  బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీకి  విప‌రీతంగా ఆద‌ర‌ణ వస్తోంది.. ఇక అనేక పేర్ల‌తో కంపెనీలు పుట్ట‌గొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి గ‌త ఆరు నెల‌లుగా. అయితే ప్ర‌పంచంలో ఏ సెంట్ర‌ల్ బ్యాంకు దేశీయంగా ఈ క్రిప్టో క‌రెన్సీల‌కు అనుమ‌తులు ఇవ్వ‌లేదు.. అయినా దీనిపై పెట్టుబ‌డులు పెడుతున్నారు ప్ర‌జ‌లు... రాబ‌డి గురించి ఆలోచించ‌కుండా పెట్టుబ‌డి పెడుతున్నారు మ‌దుప‌ర్లు.
 
 నేడు బ‌డ్జెట్ లో దీనిపై కేంద్రం ఏదో ఓ స్ప‌ష్ట‌మైన విష‌యాన్ని తెలుపుతుంది అని అంద‌రూ భావించారు.. అయితే అంచ‌నాలు తారుమారు చేశారు క్రిప్టో ఇన్వెష్ట‌ర్ల‌కు విత్త మంత్రి అరుణ్ జైట్లీ..బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీని కేంద్ర‌ ప్ర‌భుత్వం తిర‌స్క‌రించింది.. బిట్ కాయిన్ వ‌ల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అని దీనికి స‌ర్కారు వ్య‌తిరేకిస్తోంద‌ని తెలిపారు.
 
 బిట్ కాయిన్ క్రిప్టో కరెన్సీ వ‌ల్ల  ప్ర‌భుత్వం  ఎక్కువ మొత్తంగా ప‌న్ను న‌ష్ట‌పొతోంది అని అన్నారు..  అంతే కాకుండా ఆర్థిక ప‌ర‌మైన నష్టాల‌తో దేశం కుదేల‌వుతోంది. దీని వ‌ల్ల పెట్టుబ‌డులు ఆగిపొతాయి.భారత్‌లో క్రిప్టో కరెన్సీ చెల్లుబాటు అవుతుందని చెప్పేందుకు ఎలాంటి చట్టాలు లేవు అన్నారు, వీటికోసం  ఆర్‌బీఐ ఏ కంపెనీలకు  లైసెన్సులు కల్పించలేదని చెప్పారు. 
 
దేశంలో  బిట్‌కాయిన్లలో  పెట్టుబడి పెడితే, ఎలాంటి ప‌న్ను విధించాలో అధికారుల‌కు కూడా తెలియ‌దు. ఇప్ప‌టికే జీఎస్‌టీ  సంస్క‌ర‌ణ‌తో వ‌చ్చిన స‌మ‌స్య‌ను ఎలా వైదొల‌గించాలి అన్న గంద‌ర‌గోళంలో ప్ర‌భుత్వం ఉంది.ఈ నేపథ్యంలో బిట్‌కాయిన్ లాంటి క్రిప్టో కరెన్సీలను నిషేధించడమే మంచిదని కేంద్రం భావించింది.. ఇప్పటికే ఐటీశాఖ దాదాపు 5లక్షల బిట్‌కాయిన్‌ కొనుగోలుదార్లను గుర్తించి నోటీసులు జారీ చేసింది. మొత్తానికి ఎవ‌రు పెట్టుబ‌డులు వీటిపై పెట్టినా కేంద్రం త‌మ‌కు సంబంధం లేదు అనేలా క్లారిటీ ఇచ్చింది.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.