అమ‌రావ‌తికి ఫేస్‌బుక్‌

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

Updated:  2018-02-21 03:11:57

అమ‌రావ‌తికి ఫేస్‌బుక్‌

రాష్ట్రానికి పెట్టుబ‌డులు తీసుకోస్తామ‌ని తెలుగుదేశం స‌ర్కార్ ఎప్ప‌టి నుంచో చెబుతోంది. ఇందులో భాగంగానే ఏపీ ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్  ప‌లు ప‌ర్య‌ట‌న‌లు చేశారు...  ఇటీవ‌ల ఫేస్‌బుక్‌ (ఇండియా) కనెక్టివిటీ పాలసీ హెడ్‌ అశ్వనీ రానాతో భేటి అయిన  మంత్రి నారా లోకేష్ ఏపీలో ఫేస్‌బుక్ సంస్థ ఏర్పాటు చేయాల‌ని చ‌ర్చ‌లు జ‌రిపారు.
 
ఏపీలో ఫైబర్‌ గ్రిడ్ ద్వారా ప్రతి ఇంటికీ నెట్‌ సదుపాయాన్ని కల్పిస్తున్నట్లు లోకేశ్ వివ‌రించారు. 149 రూపాయ‌ల‌కే నెట్‌, వైఫై, టీవీ ప్రసారాలను ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నట్టు వివరించారు. త్వ‌ర‌లో ఏర్పాటు చేయ‌బోయే కొత్త పైలట్‌ ప్రాజెక్టులును రాష్ట్రంలో అమ‌లు చేయాల‌ని మంత్రి నారా లోకేశ్  ఫేస్‌బుక్‌ ప్రతినిధుల్ని కోరారు. ఫైబర్‌గ్రిడ్‌ వేదికగా వైఫై సేవలు విస్తరించేందుకు సహకారం అందించాల‌ని ఏపీ త‌ర‌పున కోరారు.
 
దీనిపై ఫేస్‌బుక్‌ ప్రతినిధులు స్పందిస్తూ.... గ్రామాల్లో మ‌హిళ‌లు త‌యారు చేసిన‌టువంటి  ఉత్ప‌త్తుల‌ను ఆన్‌లైన్‌లో అమ్ముకొనేలా శిక్షణ కల్పిస్తామని ఫేస్‌బుక్‌ ప్రతినిధులు చెప్పారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.