ఈ టైంలో ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

facebook new feature
Updated:  2018-03-29 03:44:55

ఈ టైంలో ఫేస్‌బుక్‌ కొత్త ఫీచర్

ఇప్ప‌టికే ప్ర‌పంచ వ్యాప్తంగా కోట్లాది మంది ఫేస్ బుక్ పై వ్య‌తిరేక‌త చూపుతున్నారు... ముఖ్యంగా వ్య‌క్తిగ‌త స‌మాచారం లీక్ అయింద‌న్న వార్త‌లు రావ‌డంతో ఇక సోష‌ల్ మీడియాలో ఫేస్ బుక్ పై యుద్దం జ‌రుగుతోంది అనే చెప్పాలి..ఈ స‌మ‌యంలో ఫేస్‌బుక్‌ దిద్దుబాటు చర్యలకు దిగింది. 
 
యూజర్‌ డేటా బ్రీచ్‌ను  అడ్డుకునేందుకు ప్రైవసీ కంట్రోల్‌లో మార్పులకు శ్రీకారం చుడుతోంది ఫేస్ బుక్ సంస్ద. ఈ క్రమంలో ఫేస్‌బుక్‌లో తాజాగా కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తేనున్నామని  సంస్ద ప్రకటించింది. యూజర్ల గోప్యతను కాపాడే ప్రయత్నాల్లో భాగంగా ‘యాక్సెస్‌ యువర్‌ ఇనఫర్మేషన్‌’ అనే కొత్త ఫీచర్‌ను పరిశీలిస్తున్నట్టు తెలిపింది. అంతేకాదు డేటా చోరీలో థర్డ్‌ పార్టీ డేటా ప్రొవైడర్లకు చెక్‌ పెట్టేలా 'పార్టనర్ కేటగిరీలను' మూసివేస్తున్నట్లు కూడా  ప్రకటించింది.
 
రాబోయే వారాలలో డేటా సెక్యూరిటీ యూజర్ల నియంత్రణలో ఉంచడానికి అదనపు చర్యలు తీసుకుంటున్నామని చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్‌ అధికారి ఎరిన్ ఎగాన్,  డిప్యూటీ జనరల్ న్యాయవాది అషిలే బెరింగ్గెర్ ఒక బ్లాగ్ పోస్ట్‌లో తెలిపారు. వినియోగదారులకు వారి సమాచారం భాగస్వామ్యంపై  మరింత నియంత్రణ ఇవ్వాలనే యోచనలో ఈ కొత్త గోప్యతా టూల్‌ ను పరిచయం చేయనున్నట్టు చెప్పింది. 
 
మెనూలో సెక్యూరిటీ షార్ట్‌కట్స్‌ ద్వారా  యూజర్ల  ఫేస్‌బుక్‌ ఖాతాలకు అదనపు భద్రతను అందించడంతోపాటు , వినియోగదారులు డేటా, యాక్టివిటీపై ఇతరుల యాక్సెస్‌ను మరింత నియంత్రిచుకోవచ్చని, యాడ్స్‌కు కూడా చెక్‌ పెట్టవచ్చని తెలిపారు. అయితే ఇది ఇంకా ప్రయోగదశలో ఉందనీ, త్వరలోనే  ఈ ఫీచర్‌ను లాంచ్‌ చేస్తామని వెల్లడించారు. మొత్తానికి ఈ ఫీచ‌ర్ ను తీసుకువ‌స్తే గోప్య‌త విష‌యంలో ఫేస్ బుక్ మ‌రింత స్ట్రాంగ్ అవుతుంది అంటున్నారు టెక్ నిపుణులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.