మొబైల్ ఫోన్ల ఉత్ప‌త్తుల్లో భార‌త్ ర్యాంక్

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

ihs ranks
Updated:  2018-04-02 01:02:57

మొబైల్ ఫోన్ల ఉత్ప‌త్తుల్లో భార‌త్ ర్యాంక్

ఈ ఆధునిక యుగంలో ప్ర‌తీ వంద‌మందిలో  సుమారు 80  మందికి పైగా మొబైల్ ఫోన్ ల‌ను వినియోగిస్తున్నారు... ప్ర‌పంచ వ్యాప్తంగా అయితే మొబైల్ ఫోన్ల‌ వాడుక‌లో చైనా మొద‌టి స్థానంలో ఉండ‌గా, ఆ త‌ర్వాత‌ స్థానంలో భార‌త్ ఉంది అని తాజాగా స‌ర్వే వెల్ల‌డిచేసింది.
 
చైనా నేషనల్‌ బ్యూరో ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ ఐహెచ్‌ఎస్‌, వియత్నాం జనరల్‌ స్టాటిస్టిక్స్‌ ఆఫీస్‌ సంయుక్తంగా నిర్వహించిన మార్కెట్ రీసెర్చ్‌ ప్రకారం భార‌తదేశం మొబైల్ ఫోన్ల ఉత్ప‌త్తిలో రెండోస్థానంలో ఉంద‌ని ఒక‌ నివేదిక‌లో పేర్కొన్నారు... ఐసీఏ ఇచ్చిన డేటా ప్రకారం 2014లో భారత్‌ నుంచి ఉత్పత్తి అయిన మొబైల్‌ ఫోన్లు 3 మిలియన్‌ యూనిట్లు కాగా.. 2017 నాటికి అది 11 మిలియన్‌ యూనిట్లకు చేరింది.
 
దీంతో ప్ర‌పంచ‌వ్యాప్తంగా  చూసిన‌ట్లు అయితే మొబైల్ ఉత్ప‌త్తిలో చైనా మొద‌టి స్థానాన్ని కైవ‌సం చేసుకోగా రెండో స్థానంలో వియ‌త్నాం ఉండ‌గా 2017-18 నాటికి ఆ స్థానాన్ని భార‌త్ కైవ‌సం చేసుకుంది... మొబైల్‌ ఫోన్ల ఉత్పత్తి పెరగడంతో పాటు.. దేశంలో మొబైల్‌ పరికరాల దిగుమతులు కూడా 2018 నాటికి  సగానికి త‌గ్గాయ‌ని పేర్కొన్నారు..
 
2019 మొబైల్ ఫోన్ల‌ ఉత్ప‌త్తిలో 500 మిలియ‌న్ల‌కు పైగా ఉత్ప‌త్తి చేయ‌డ‌మే ల‌క్ష్యంగా చేసుకుని భార‌త్ ప‌నిచేస్తోంద‌ని ఐహెచ్‌ఎస్ తెలిపింది... మొబైల్ త‌యారి పెరిగితే దేశంలో ఉన్న నిరుద్యోగుల‌కు ప్ర‌త్య‌క్షంగా, లేక ప‌రోక్షంగా  వారికి ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించే దిశ‌గా అడుగులు వేస్తోంద‌ని తెలిపారు... వ‌చ్చే సంవ‌త్స‌రానికి 1.5మిలియన్ల విలువైన 120 మిలియన్ల మొబైల్‌ ఫోన్ల యూనిట్లను విదేశాలకు ఎగుమతి చేయాలని భారత్‌ లక్ష్యంగా చేసుకుని ప‌ని చేస్తోంద‌ని ఐహెచ్‌ఎస్ చైర్మ‌న్ వెల్ల‌డించారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.