తొలిటెస్ట్ లో భార‌త్ ప‌రాజ‌యం స్కోర్ వివ‌రాలు ఇలా

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

virat kohli
Updated:  2018-08-04 05:55:41

తొలిటెస్ట్ లో భార‌త్ ప‌రాజ‌యం స్కోర్ వివ‌రాలు ఇలా

ఇంగ్లండ్ తొలి టెస్ట్ లో భార‌త్ పరాజ‌యం పాలు అయింది. స్వ‌ల్ప విజ‌యాన్ని చేదించ‌లేక చ‌తికిల ప‌డింది కోహ్లీ సేనా. ఈ మ్యాచ్ లో నాలుగు వికెట్స్ తీసిన మెంచ్ స్రోక్స్ భార‌త ఓట‌మికి కీల‌క పాత్ర పోషించాడు. విజ‌యానికి 194 పరుగులు చేయాల్సిన‌ భార‌త్ 162 ప‌రుగులకే భార‌త్ అలౌట్ అయింది. కోహ్లీ 51 ప‌రుగులు, పాండ్యా31 ప‌రుగులు చేశారు. ఇక మిగతా బ్యాట్స్ మెన్స్ ఈ టోర్నీలో పెద్ద‌గా రాణించ‌లేక‌పోయారు. 
 
నిన్న‌టి స్కోర్ వ‌ద్ద ప్రారంభించిన భార‌త్ 3వ బంతికే షాక్ త‌గిలింది. స్కోర్ బోర్డ్ పై ప‌రుగులు ఏమీ క‌న‌బ‌డ‌కుండానే దినేష్ కార్తిక్ అవుట్ అయ్యాడు. ఇక అదే వోవ‌ర్లోనే ష‌మీ అవుట్ కాగా మ‌రికొద్ది సేప‌టికే కెప్టెన్ కోహ్లీ వెనుతిరిగాడు. ఇక భార‌త్ మ్యాచ్ పై ఆశ‌లు వ‌దులుకున్న స‌మ‌యంలో కొద్ది సేపు పాండ్యా, ఇశాంత్ స్కోర్ బోర్డ్ ను ముందుకు న‌డిపించారు. అయితే ఇశాంత్ ఎల్బీడ‌బ్ల్యూగా రిషీద్ వేన‌క్కి పంప‌డంతో మ్యాచ్ చేజారిన‌ట్లు అయింది. ఇక చివ‌ర్లో పాండ్యాను స్రోక్స్ అవుట్ చేయ‌డంతో టీమిండియా క‌థ ముగిసింది. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.