విరాట్ కోహ్లీ 30ఇయ‌ర్స్ క్రికెట్ జ‌ర్నీపై స్పెష‌ల్ స్టోరీ

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

virat kohli
Updated:  2018-11-06 12:41:59

విరాట్ కోహ్లీ 30ఇయ‌ర్స్ క్రికెట్ జ‌ర్నీపై స్పెష‌ల్ స్టోరీ

ఒక్కో తరానికి ఒక క్రికెట్ లెజెండ్ ఉన్నట్లే.. సమకాలీన క్రికెట్‌లో దిగ్గజ ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు భారత కెప్టెన్ విరాట్ కోహ్లీ. ప్రస్తుత క్రికెటర్లతో ఏ విధంగా పోల్చి చూసినా కోహ్లీని అందుకునే వారే లేరని అతడి గణాంకాలే చెబుతాయి. కెరీర్ ఆరంభంలో దూకుడెక్కువ అన్నారు. కానీ తన దూకుడు ప్రత్యర్థి బౌలర్లపై చెలరేగడంలో అని బ్యాట్‌తోనే సమాధానమిచ్చాడు కోహ్లీ. పరుగుల యంత్రంగా పేరు తెచ్చుకున్న రికార్డుల రారాజు కోహ్లీ పుట్టినరోజు నేడు. 
 
30 ఏట అడుగుపెడుతున్న కోహ్లీకి సహచరులు, బీసీసీఐ, ఇతర సన్నిహితుల నుంచి పుట్టినరోజు శుభాకాంక్షలు సందేశాలు వెల్లువెత్తుతున్నాయి. వెస్టిండీస్‌తో ఇటీవల విశాఖలో జరిగిన రెండో వన్డేలో విరాట్‌ కోహ్లీ 10వేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఈ ఫీట్ నమోదు చేసిన 5వ భారత క్రికెటర్ కాగా, ఓవరాల్‌గా 13వ ఆటగాడు. అయితే వన్డేల్లో సచిన్‌ 259 ఇన్నింగ్సుల్లో పదివేల పరుగుల మార్కు చేరుకోగా, కోహ్లీ కేవలం 205 ఇన్నింగ్స్‌ల్లో, ప్రపంచంలోనే అత్యంత వేగంగా ఈ 10 వేల పరుగుల మార్క్ అందుకున్న ఆటగాడిగా నిలిచాడు. వన్డే, టెస్ట్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌కు సొంతం చేసుకున్నాడు.
 
ప్రొఫెషనల్ లో ఎంత హుందా గా ఉన్నదో పర్సనల్ లైఫ్ లో కూడా అంతే హుందాగా జీవిస్తున్నాడు కోహ్లీ.. సినీ నటి అనుష్క శర్మ ను పెళ్లి చేసుకు