జియో ఆఫ‌ర్స్ ను చూస్తే ఫిదా అవ్వాల్సిందే....!!

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

Updated:  2018-02-11 05:14:24

జియో ఆఫ‌ర్స్ ను చూస్తే ఫిదా అవ్వాల్సిందే....!!

రిల‌య‌న్స్ కంపెనీలో అనుబంధ సంస్థ జియో... అతి చౌక‌నైన ధ‌ర‌కే మొబైల్, చౌక ధ‌ర‌కే ఇంట‌ర్ నెట్ డాటాను  మార్కెట్ లోకి ప్ర‌వేశ పెట్ట‌డంతో త‌క్కువ స‌మ‌యంతోనే సుమారు 1000  మంది మిలియ‌న్ డాల‌ర్ క‌స్ట‌మ‌ర్లు ఈ నెట్ వ‌ర్క్ ను వినియోగిస్తున్నారు... మార్కెట్ లోకి  అతి త‌క్కువ ధ‌ర‌తో జియో నెట్ వ‌ర్క్ ను ప్ర‌వేశ‌పెట్ట‌డంతో మిగిలిన సంస్థ నెట్ వ‌ర్క్ లు ఈ సంస్థ‌కు పోటీ ప‌డ‌లేకపోతున్న సంగ‌తి తెలిసిందే...
 
అయితే  తాజాగా రిలయన్స్ జియో సంస్థ వినియోగ‌దారుల కోసం మ‌రో  కొత్త ఆఫ‌ర్ ను ప్ర‌వేశ పెట్టింది...  జియో స్మార్ట్ ఫోన్ కొన్న వారికి ఉచిత కాల్స్ ఆఫ‌ర్ ను  ప్ర‌క‌టించారు... ఈ మొబైల్ తీసుకున్న‌వారికి ఇంట‌ర్ నెట్ స‌దుపాయంతో పాటు గూగుల్ క్రోమ్ జియో టీవీ ద్వారా సుమారు 450 ఛాన‌ల్స్ ల‌ను ఈ స్మార్ట్ ఫోన్ లో చూడ‌వ‌చ్చ‌ని తెలిపారు...
 
ఈ మొబైల్ తీసుకునేవారు రూ.1,500 డిపాజిట్‌ చేసి జియో ఫోను తీసుకుంటే మూడేళ్ల తర్వాత ఈ డిపాజిట్‌ సొమ్మును తిరిగి ఇచ్చేస్తుంది. ఇందులో ప్రతీ నెలా రూ.49 చెల్లిస్తే నెల రోజుల పాటు ఉచితంగా నిరంతరాయంగా మాట్లాడుకునే వెసులుబాటును కల్పిస్తోంది రిల‌య‌న్స్ జియో సంస్థ‌.
 
 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.