ఫేస్‌బుక్‌కు దిగ్గజాలు గుడ్ బై

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

face book
Updated:  2018-03-24 04:02:33

ఫేస్‌బుక్‌కు దిగ్గజాలు గుడ్ బై

ఇప్పుడు ప్రంపంచ వ్యాప్తంగా డేటా బ్రీచ్ సెగ బాగా ఫేస్ బుక్ ను వేధిస్తోంది.. కోట్లాది మంది ఖాతాదారుల వ్యక్తిగత సమాచారాన్ని విక్రయించిందన్న ఆరోపణలు దుమారం మరింత ముదురుతోంది...ఇప్పటికే డిలిట్‌ ఫేస్‌బుక్‌ హ్యాష్‌ట్యాగ్‌తో ఉద్యమం  సోషల్‌ మీడియాలో  కాకపుట్టిస్తోంటే... రెండు రోజులుగా ప్రపంచ వ్యాప్తంగా మ‌రింత వైర‌ల్ అవుతోంది.
 
ఇక ఈ ఉద్య‌మంతో తాజాగా కొన్ని కంపెనీలు సంచ‌ల‌న నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి.. తాజాగా మొజిల్లా, టెస్లా, స్పేస్‌ఎక్స్‌ లాంటి ప్రముఖ కంపెనీలు కూడా ఫేస్‌బుక్‌ను గుడ్‌ బై చెపుతున్నాయి.. ఫేస్ బుక్ లో ఈ కంపెనీల‌కు ల‌క్ష‌లాదిగా ఉన్న ఫాలోవ‌ర్ల పేజ్ అకు అకౌంట్ల‌కు గుడ్ చై చెప్పాయి ఈ కంపెనీలు. టెస్లా, స్పేస్‌ఎక్స్‌ కంపెనీల ఫేస్‌బుక్‌  అకౌంట్లను తొలగించినట్టు ఎలన్‌ మస్క్‌  ప్రకటించడం ఇప్పుడు పెద్ద చ‌ర్చ‌కు దారితీసింది బిజినెస్ వ‌ర్గాల్లో.
 
2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికల సమయంలో ట్రంప్‌ కోసం పనిచేసిన కేంబ్రిడ్జ్‌ అనలిటికాకు 5కోట్ల మంది ఫేస్‌బుక్‌ ఖాతాదారుల వ్యక్తిగత సమాచారం లీక్‌ ఆరోపణలతో ఫేస్‌బుక్‌కు చిక్కులు ఎదురయ్యాయి. మరోవైపు కేంబ్రిడ్జ్‌ అనలిటికా సంస్థలో  రెగ్యులేటరీ అధికారులు సోదాలు నిర్వహించారు...పొరబాటు జరిగింది క్షమించండంటూ ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జుకర్‌బర్గ్‌   విజ్ఞప్తి చేసినప్పటికీ  5కోట్ల  వినియోగదారుల సమాచారం లీక్‌ అంశం రేపిన ఆగ్రహం​ చల్లారడంలేదు. ఈ ఆగ్రహం అన్ని దేశాల్లో పెరిగిపోతోంది. వ్యక్తిగత సమాచారం లీక్  చేయ‌డం ఏమిట‌ని విమ‌ర్శ‌లు జోరుఅందుకున్నాయి.
 
ఫేస్‌బుక్‌పై ఎలన్‌ మస్క్‌ వ‍్యంగ్యాస్త్రాలు సంధించారు !!
 
ఫేస్‌బుక్‌ అనేది ఒకటుందనేది తనకు తెలియందంటూ వ్యంగ్యంగా కమెంట్‌ చేశారు. తాను గానీ, తన కంపెనీలుగానీ ఫేక్‌ ఎండార్స్‌లు చేయమన్నారు. మరోవైపు ఇన్ స్టాగ్రామ్ కాస్త‌ పరవాలేదంటూ అభిప్రాయంగా చెప్పారు. నిజాయితీగా ఉన్నంతకాలం  ఇన్‌స్ట్రాగ్రామ్‌ ఒకే  అన్నారు. ఫేస్‌బుక్‌  ఏంటి? నేను అసలు ఫేస్‌బుక్‌ వాడను.. ఎప్పటికీ వాడనంటూ ఆయన ట్వీట్‌ చేశారు. . సో..ఇది తనను, తన కంపెనీలను పెద‍్ద దెబ్బ తీస్తుందని భావించడంలేని పేర్కొన్నారు.  దీంతో గత ఏడాది  రోబోల విషయంలో ఫేస్‌బుక్‌ సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌ ..ఎలన్‌మస్క్‌,​ మధ్య జరిగిన  మాటల యుద్ధాన్ని  టెక్‌ నిపుణులు గుర్తు చేస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.