ఈ బంతితో భారత్ ను చూటేస్తా

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

india
Updated:  2018-06-13 06:44:48

ఈ బంతితో భారత్ ను చూటేస్తా

భారత జట్టులో ఎంతో మంది స్పిన్నర్లు ఉన్నారు..ఒక్కొక్క స్పిన్నర్లకు ఒక్కొక్క స్టైల్ ఉంటుంది...అలాగే భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ కు ఒక స్టైల్ ఉంది..అతను వైవిధ్యమైన బంతులతో బ్యాట్స్ మన్ ని ఇబ్బందిపెడతాడు...2018 ఐపీల్ లో కూడా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టుకు ప్రాతినిధ్యం వహించిన అశ్విన్ ఎప్పటిలాగే అక్కట్టుకున్నాడు...ఆ సీజన్లో పంజాబ్ జట్టు తరఫున అఫ్గానిస్థాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ కూడా ప్రాతినిధ్యం వహించాడు...
 
ఆ సమయంలో అఫ్గానిస్థాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ కి అశ్విన్ స్పిన్ లో ఉన్న మెళకువలను నేర్పించాడు...దానితో పాటు అశ్విన్ ఒక వైవిధ్యమైన కొత్త బంతిని నేర్పించాడని అఫ్గానిస్థాన్ స్పిన్నర్ ముజీబ్ ఉర్ రెహ్మాన్ వెల్లడించాడు...ఈ కొత్త తరహా బంతిని మొదటగా భారత్ పైనే ఉపయోగిస్తానని చెప్పాడు...గురువారం నుంచి భారత్‌తో బెంగళూరు వేదికగా జరగనున్న ఏకైక టెస్టులో వాటిని ఆ బంతిని ఉపయోగించి భారత ఆటగాళ్లను కట్టడి చేస్తానని ధీమా వ్యక్తం చేసారు ఈ అఫ్గానిస్థాన్ స్పిన్నర్...
 
అఫ్గానిస్థాన్‌కి ఇదే తొలిటెస్టు..ఇటీవలే టెస్టు హోదాను దక్కించుకుంది..ఈమ్యాచ్ కోసం అఫ్గానిస్థాన్‌ ఆటగాళ్లు ఆతృతగా ఎదురుచూస్తున్నారు...17 ఏళ్ల ముజీబ్ కూడా ఈ చారిత్రక టెస్టు కోసం తాను ఇప్పటికే అన్ని వ్యూహాలతో సిద్ధమైనట్లు వెల్లడించాడు. ఐపీఎల్‌లో మొత్తం 11 మ్యాచ్‌లాడిన ముజీబ్ 14 వికెట్లు పడగొట్టాడు. 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.