అంబానీ ఇంట‌పెళ్లి సంద‌డి

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

isha ambani
Updated:  2018-05-07 04:54:25

అంబానీ ఇంట‌పెళ్లి సంద‌డి

భార‌త‌ కుబేరుడు, బిలియ‌నీర్ రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత  ముఖేష్ అంబానీ ఇంట పెళ్లి భాజా మోగ‌నుంది... అదేంటి ఇంత‌కు ముందే అంబానీ కుమారుడికి నిశ్చితార్థం అయిపోయి పెళ్లికి కూడా డేట్ ఫిక్స్ చేశారు కదా? అని అనుకుంటున్నారా... సీన్ క‌ట్ చేస్తే అంబానీ కుమారుడి తో పాటు ఆయ‌న కుమార్తె ఇషా అంబానీ పెళ్లి కూడా ఒకే సంవ‌త్స‌రంలో చేయ‌నున్నారు... అయితే కుమారుడి పెళ్లి కంటే ఇషా వివాహం ఒక నెల ముందుగానే చేసేందుకు సిద్ద‌మ‌య్యారు అంబానీ కుటుంబం.
 
ఇషా అంబానీని వివాహం చేసుకోబోయే వ్య‌క్తి ఎవ‌రంటే..  ప్ర‌ముఖ పిరమల్‌ గ్రూప్‌ వారసుడు, అజయ్‌ పిరమల్‌, స్వాతి దంపతుల కుమారుడు ఆనంద్‌ పిరమల్‌ను ఇషా మ‌నువాడ‌నుంది..  పిర‌మ‌ల్ కుటుంబానికి, అంబానీ కుంటుంబానికి నాలుగు ద‌శాబ్దాలుగా స‌న్నిహిత సంబంధాలు ఉన్నాయి... ఈ స‌న్నిహితంతో  వీరిరువురు కుటుంబాల  మ‌ధ్య ఇషా కు ఆనంద్ కు వివాహం చేయాల‌ని నిర్ణ‌యించారు.
 
ఇషా ఆనంద్ లు ఇద్దరూ చిన్ననాటి స్నేహితులు... ఈ స్నేహం కాస్త ప్రేమగా మారింది....ఈ క్ర‌మంలో ఆనంద్ పిరమల్ త‌న ప్ర‌పొజ‌ల్ ను  మహాబలేశ్వరంలోని ఓ ఆల‌యంలో ఇషాకు చెప్పిన‌ట్లు తెలుస్తోంది...  అయితే ఆనంద్ పిర‌మ‌ల్ ప్ర‌పొజ‌ల్ ను ఇషా అంగీకరించ‌డంతో అక్క‌డే ఉంగరాలు మార్చుకున్నట్లు సమాచారం... దీంతో పాటు అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇషా అంగీకరించిన‌ట్లు తెలుస్తోంది... అయితే వారి ప్రేమ విష‌యం ఇరు కుటుంబాల‌పెద్దలకు తెలియజేయడంతో  ఇషా ఆనంద్  ప్రేమ‌ల‌ను పెద్ద‌లు అంగీక‌రించారు.. దీంతో వివాహానికి ఇరు కుటుంబాలు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చారు.
 
పెన్సిల్వేనియా వర్సిటీలో ఆర్థిక శాస్త్రంలో గ్రాడ్యుయేషన్‌, అలాగే  హార్వర్డ్‌ వర్సిటీలో ఎంబీయే చేశారు ఆనంద్‌ పిరమల్‌.. ప్రస్తుతం పిరమల్‌ ఎంటర్‌ప్రైజెస్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌గా బాధ్య‌త‌ల‌ను నిర్వ‌హిస్తున్నారు.... అలాగే పిరమల్‌ రియల్టీ పేరుతో ఒక రియల్‌ ఎస్టేట్‌ కంపెనీని స్థాపించారు.. పిరమల్‌ స్వాస్థ్య పేరుతో గ్రామీణ ఆరోగ్య సంరక్షణ సంస్థను స్థాపించి, రోజుకు 40 వేల మంది రోగులకు చికిత్సనందిస్తున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.