అంబానీ ఇంట పెళ్లి వ‌ధువు ఎవ‌రో తెలుసా....

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

mukesh ambani son marriage image
Updated:  2018-03-06 03:12:53

అంబానీ ఇంట పెళ్లి వ‌ధువు ఎవ‌రో తెలుసా....

రిల‌య‌న్స్ ఇండ‌స్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ ఇంట త్వ‌ర‌లో పెళ్లి బాజా మోగ‌నుంద‌ని, బిజినెస్ వ‌ర్గాల్లో చ‌ర్చ మొద‌లైంది.. విశ్వ‌స‌నీయ వ‌ర్గాల‌ స‌మాచారం... ముఖేష్ అంబాబీ, నీతా అంబానీ పెద్ద  కుమారుడు ఆకాశ్ అంబానీకి పెళ్లి చేయ‌నున్నార‌ట‌... ఇందుకోసం ప‌నుల‌ను శ‌ర‌వేగంగా చేస్తున్నారు... అయితే గతంలో కూడా ఆకాష్ వివాహం చేసుకోబోతున్నాడంటూ... పెళ్లి ప‌త్రిక సుమారు ల‌క్ష రూపాయ‌లు ఉంటుంద‌ని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే... కానీ ఈ వార్త‌ల్లో ఏమాత్రం నిజం లేద‌ని అంబానీ కుటుంబ స‌భ్యులు చెప్పారు.
 
అయితే తాజాగా మ‌రోసారి అంబానీ ఇంట పెళ్లి  బాజా మోగ నుంద‌ని, ప్ర‌ముఖ వ‌జ్రాల వ్యాపార వేత్త రోజీ బ్లూ డైమండ్స్ అధిపతి రసెల్ మెహతా చిన్న కుమార్తె శ్లోకను ఆకాష్ కు ఇచ్చి వివాహం చేయ‌నున్నారు... వీరిద్ద‌రు ఇంట‌ర్ లో ఒకే కాలేజీలో చ‌దువుకోవ‌డంతో ఒక‌రినొక‌రు ప్రేమించుకున్నార‌ట‌... అయితే వీరిద్ద‌రి ప్రేమ వ్య‌వ‌హారం ఇరు కుటుంబీకులు అంగీక‌రించ‌డంతో పెళ్లికి రెడి అవుతున్నారు... డిసెంబరులో వీరి వివాహం జరగనుండగా అతి త్వరలో నిశ్చితార్థం తేదీని ప్రకటించనున్నారు.
 
ఆకాశ్ అంబానీ అమెరికాలోని బ్రౌన్ యూనివర్సిటీ నుంచి అర్థ శాస్త్రంలో డిగ్రీ పూర్తి చేశారు. ప్రస్తుతం రిలయన్స్ జియో బోర్డులో   కీల‌క భాధ్య‌త‌ల‌ను చేప‌డుతున్నారు...ఇక‌ శ్లోక ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ ఆంత్రోపాలజీలో డిగ్రీ చేసి లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పొలిటికల్ సైన్స్ నుంచి న్యాయ విద్యలో లా పూర్తి చేశారు. అయితే ప్ర‌స్తుతం శ్లోక రోజీ బ్లూ స్వచ్ఛంద సంస్థలో డైరెక్టర్‌గా కొనసాగుతున్నారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.