ఫేస్ బుక్ లో స‌రికొత్త ఫీచ‌ర్

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

Updated:  2018-02-09 03:17:57

ఫేస్ బుక్ లో స‌రికొత్త ఫీచ‌ర్

ఫేస్ బుక్ తాజాగా అనేక కొత్త నిర్ణ‌యాల‌తో మార్కెట్లో దూసుకుపోతోంది.. కొత్త కొత్త ఫీచ‌ర్ల‌తో యూజ‌ర్ల‌కు స‌రికొత్త ట్రెండ్ న‌డిపిస్తోంది. తాజాగా స‌రికొత్త ఫీచ‌ర్ల‌ను లాంచ్ చేసేందుకు సిద్దం అవుతోంది ఫేస్ బుక్.. ఇక పై ఫేస్ బుక్ లో అసంబద్ధ వ్యాఖ్యలు, అబ్యూసివ్‌  వ్యాఖ్యలతో ఇబ్బందులు పడే  వినియోగదారుల సౌలభ్యం కోసం కొత్త‌గా డౌన్‌ వోట్  అనే ఫీచర్‌ను టెస్ట్‌  చేస్తోంది ఈ సోష‌ల్ మీడియా దిగ్గ‌జం.
 
ఫేస్‌బుక్‌  పోస్ట్‌లపై వినియోగదారులకు ప్రతికూల స్పందనను నమోదు చేసే ఒక లక్షణాన్ని పరీక్షిస్తోంది తాజాగా... అయితే  చాలామంది ఫేస్‌బుక్‌ వినియోగదారులకు  ఆశిస్తున్నట్టుగా డిజ్‌లైక్‌ బటన్‌లా కాకుండా సరికొత్తగా దీన్ని పరీక్షిస్తోంది. డిస్ లైక్ బ‌ట‌న్  ఆప్ష‌న్ ఏర్పాటు చేయాలి అని కంపెనీకి ఎప్ప‌టి నుంచో ఫిర్యాదులు వ‌స్తున్నాయి అలాగే స‌ల‌హాలు కూడా ఇస్తున్నారు కొంద‌రు.
 
ఇక‌పై ఫేస్ బుక్ యూజ‌ర్ల‌ను ఇబ్బంది పెట్టేలా కామెంట్లు వ‌స్తే సంబంధిత యూజ‌ర్లు డౌన్ వోట్ బ‌ట‌న్ క్లిక్ చేసిన‌ప్పుడు  ఆవ్యాఖ్య ప్రమాదకరమైందా, తప్పుదోవ పట్టించేదా, లేదా టాపిక్‌తో సంబంధం లేనిదా  చెప్పమని అడుగుతుంది. త‌ర్వాత  ఆ కామెంట్లు మిగతా యూజర్లకు కనిపించకుండా చేస్తుంది టెక్నిక‌ల్ గా .. దీనిపై టెస్టింగ్ జ‌రుగుతోంది కొన్ని అకౌంట్ల ద్వారా ఇది ప్ర‌యోగాత్మ‌కంగా ప‌రిశీలిస్తున్నామ‌ని తెలిపారు అమెరికాలో సంస్ద ప్ర‌తినిధులు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.