కొత్త 10 నోట్లు కలర్ ఇదేనట?

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

Updated:  2018-01-20 09:45:22

కొత్త 10 నోట్లు కలర్ ఇదేనట?

నోట్ల ర‌ద్దుతో ప్ర‌తీ పేద మ‌ధ్య త‌ర‌గ‌తి వారు న‌గ‌దు కొర‌త‌తో ఎన్నో క‌ష్టాలు ప‌డిన సంగ‌తి తెలిసిందే.. ఇక కొత్త రెండు వేల నోట్లు 500 రూపాయ‌ల నోట్ల‌ను మార్కెట్లోకి దింపింది కేంద్ర‌ప్ర‌భుత్వం.. అయితే నోట్ల ర‌ద్దు జ‌రిగి ఏడాది దాటిపోయినా ఇంకా న‌గ‌దు చ‌లామ‌ణిలో కొత్త నోట్లు అంద‌రికి అందుబాటులో లేవు.

తాజాగా రెండు వంద‌ల రూపాయ‌ల నోట్ల‌ను, 50 రూపాయ‌లు విలువ‌క‌లిగిన  డినామినేష‌న్ ను  కూడా విడుద‌ల చేసింది ఆర్బీఐ.. ఇక రిజర్వు బ్యాంకు ఆఫ్‌ ఇండియా కొత్త రూ.10 నోట్లు జారీచేయడానికి సిద్ధమవుతోంది అని తెలుస్తోంది. ఈ నోట్లు చాక్లెట్ బ్రౌన్ క‌ల‌ర్ లో మ‌హాత్మా గాంధీ సిరీస్ లో ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నార‌ట‌.. అంతే కాదు ఈ నోట్ల పై కొణార్క్‌ సన్‌ టెంపుల్‌ పిక్చర్‌ ఉండబోతుందని స‌మాచారం.

సెంట్రల్‌ బ్యాంకు ఇప్పటికే ఈ కొత్త నోట్లను 1 బిలియన్‌ పీసులను  ప్రింట్‌ చేసినట్టు ఈ విషయం తెలిసిన అధికారులు చెప్పారు. కొత్త రూ.10 నోటుకు సంబంధించి డిజైన్‌ను కూడా ప్రభుత్వం గత వారంలోనే ఆమోదించిందని అధికారులు తెలియ‌చేశారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.