పత్రికా స్వేచ్ఛలో భారత్‌ ర్యాంక్

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

rsf media
Updated:  2018-04-27 12:04:41

పత్రికా స్వేచ్ఛలో భారత్‌ ర్యాంక్

ప్ర‌పంచవ్యాప్తంగా ప‌త్రికా స్వేచ్చ స‌ర్వే 2017-2018 సంవ‌త్స‌రానికి సంబంధించి రిపోర్టర్స్‌ వితౌట్‌ బోర్డర్స్ (ఆర్‌ఎస్‌ఎఫ్‌) ఒక నివేదిక‌ను జారీ చేసింది.. ఈ నివేదిక‌లో క‌ని విని ఎరుగ‌ని రీతిలో భార‌త్ ర్యాంక్ చేరుకుంది... గ‌త ఏడాదిలో ప్ర‌పంచ దేశాల‌తో పోలిస్తే భార‌త‌దేశం 136 ర్యాంక్ ను  ద‌క్కించుకుంది... కానీ ఈ ఏడాది  మాత్రం 138 ర్యాంక్ ను  ద‌క్కించుకుంద‌ని ఆర్‌ఎస్‌ఎఫ్ అంతర్జాతీయ సంస్థ తెలిపింది.
 
అయితే ఇదంతా ప్ర‌ధానమంత్రి మోడీ వ‌ల్లే జ‌రిగింద‌ని, ఆయ‌న అధికారంలోకి వ‌చ్చాక దేశ వ్యాప్తంగా ప‌త్రిక‌కు స్వేచ్చ‌లేకుండా పోయింద‌ని తెలిపింది... ప్ర‌పంచంలో సంపూర్ణ‌మైన ప‌త్రిక స్వేచ్చ దేశంగా  నార్వే ఉండ‌గా   ఉత్తరకొరియా అట్టడుగు స్థానంలో ఉన్నట్లు తెలిపింది... అయితే 2016 - 2017 సంవ‌త్స‌రంలో కూడా ప‌త్రికా స్వేచ్చ దేశంగా నార్వే దేశం మొద‌టి స్థానంలో నిలిచింది.
 
వివిధ అంశాల‌ను ఆధారంగా చేసుకుని ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న 180 దేశాల‌ల‌లో ప‌త్రికా స్వేచ్చ అంశంపై ఆర్‌ఎస్‌ఎఫ్ అంతర్జాతీయ సంస్థ ప్ర‌తీ సంవ‌త్స‌రం ర్యాంకింగ్ అందిస్తోంది.... అయితే ఈ ఏడాది కూడా ఒక నివేదిక‌ను విడుద‌ల చేసింది... ఇక ఈ ఏడాది నివేదిక‌లో మోదీ అధికారంలోకి వచ్చాక భారత్‌లో హిందూ  విద్వేష పూరిత ప్రసంగాలు, నేరాలు పెరిగిపోయాయ‌ని  తెలిపింది... హిందూ మత ఆధిక్యత, కుల వ్యవస్థ, మహిళా హక్కులపై ప్రభుత్వాన్ని విమర్శించే మీడియాతోపాటు జర్నలిస్టులపై బెదిరింపులు, భౌతిక దాడులు  మోడీ అధికారంలో ఎక్కువ జ‌రిగాయ‌ని ఆర్‌ఎస్‌ఎఫ్ అంతర్జాతీయ సంస్థ పేర్కొంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.