బ‌య‌ట‌కు వ‌చ్చిన సామ్ సంగ్ వారసుడు

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

Updated:  2018-02-05 04:51:43

బ‌య‌ట‌కు వ‌చ్చిన సామ్ సంగ్ వారసుడు

మొబైల్ దిగ్గ‌జం సామ్ సంగ్ అంద‌రికి తెలిసిందే... స్మార్ట్ ఫోన్ల‌లో విప్ల‌వాత్మ‌క మార్పుల‌ను తీసుకువ‌చ్చి విప‌ణిలో దూసుకుపోయింది ఈ కంపెనీ... ద‌క్షిణ కొరియా నుంచి దావోస్ వ‌ర‌కూ అన్ని చోట్లా తన బ్రాండ్  ను నిల‌బెట్టింది సామ్ సంగ్.. తాజాగా ఈ ఎల‌క్ట్రానిక్ ఉత్ప‌త్తుల సంస్ద సామ్ సంగ్ వార‌సుడైన జే.వై.లీని అక్క‌డ అప్పీళ్ల కోర్టు విడుద‌ల చేయాల‌ని ఆదేశించింది.
 
సామ్‌సంగ్‌ వైస్‌ ఛైర్మన్‌ అయిన జే వై.లీకి  అవినీతికి పాల్పడిన కేసులో గత ఏడాది  కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష విధించింది... ఈ అవినీతి కుంభకోణంతో సంబంధంతో పాటు పలు అంశాల్లో అధికార దుర్వినియోగానికి పాల్పడిన కారణంగా ద.కొరియా మాజీ అధ్యక్షురాలు పార్క్‌ గెన్‌-హై గత ఏడాది పదవి నుంచి దిగిపోయిన సంగతి తెలిసిందే.
 
అయితే ఈ వివాదం పై తాజాగా విచారించింది న్యాయ‌స్ధానం వైలీ శిక్ష‌ను తగ్గించ‌డంతో పాటు ఆయ‌న పై ఉన్న ఆరోప‌ణ‌ల‌ను కొట్టేసి ఆయ‌న‌ను విడుద‌ల చేయాల‌ని ఆదేశించింది. ఎల‌క్ట్రానిక్ వ్యాపార‌దిగ్గ‌జ వార‌సుడు 49 ఏళ్ల వైలీ అరెస్ట్ తో కంపెనీ పై ఎటువంటి ప్ర‌భావం ప‌డుతుందా అని అంద‌రూ అనుకున్నారు..49 ఏళ్ల వైలీని 2017 ఫిబ్ర‌వ‌రిలో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.....2014లో సామ్‌సంగ్‌ ఛైర్మన్‌ లీ కున్‌-హీకి గుండెపోటు వచ్చి మంచానికే పరిమితమవ్వడంతో ఆయన కుమారుడైన జే వై.లీ సామ్‌సంగ్‌ బాధ్యతలు చేప‌ట్టారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

ఎక్కువ మంది చదివినవి


Warning: mysql_num_rows() expects parameter 1 to be resource, boolean given in /home/janah7m6/public_html/mostreadnews.php on line 39

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.