1100, కైజాల, పీపుల్స్ ఫస్ట్ అన్నీ తూచ్

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

Updated:  2018-01-20 09:39:47

1100, కైజాల, పీపుల్స్ ఫస్ట్ అన్నీ తూచ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో తెలుగుదేశం పార్టీ ప్ర‌భుత్వ వైఫ‌ల్యాల‌పై  రోజుకో వార్త తెర‌పైకి వ‌స్తోంది. ఇప్ప‌టికే ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు నెర‌వేర్చ‌లేద‌న్న వాద‌న ప్ర‌జ‌ల నుండి బ‌లంగా వినిపిస్తోంది. ఈ విష‌యం ప్ర‌స్తుతం జ‌రుగుతున్న జ‌న్మ‌భూమి కార్య‌క్ర‌మంలోనే బ‌య‌ట‌ప‌డింది.

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే.... ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకుగానూ ప్ర‌భుత్వం 1100 అనే నంబ‌ర్ ను కేటాయించింది. అంతేకాదు ఏవైనా స‌మ‌స్య‌ల‌ను కైజాల  అనే యాప్ ద్వారా ప్ర‌భుత్వానికి తెలియ‌జేయ‌వ‌చ్చ‌ని పేర్కొంది. 

దీంతోపాటు  పీపుల్ ఫ‌స్ట్ అనే యాప్ ను కూడా ప్ర‌స్తుతం ప్ర‌భుత్వం అందుబాటులో ఉంచింది. ఈ మార్గాల ద్వారా రాష్ట్రంలో  వేల సంఖ్య‌లో ప్ర‌జా స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించామ‌ని  ప్ర‌భుత్వం గొప్ప‌లు చెప్పుకుంటోంది. అయితే వాస్తవ ప‌రిస్ధితులు వేరేలా ఉన్నాయి. 

ఇదంతా  అధికార పార్టీ సెల్ప్ డ‌బ్బా అని తేలిపోయింది. స‌మ‌స్య‌లు ప‌రిష్కారం ఏమో గాని,  పైన పేర్కొన్న వాటి ఏ మార్గం ద్వారా స‌మ‌స్య‌ను  ఫిర్యాదు చేసినా.....  క‌నీసం రిప్లై కూడా ఇవ్వ‌క‌పోవ‌డం గ‌మ‌నార్హం. క‌ర్నూలు జిల్లా ఆలూరు నియోజ‌క‌వ‌ర్గంలోని అలారుదిన్నె  గ్రామంలో రామాంజిని  అనే ఓ దివ్యాంగుడికి 80 శాతానికి పైగా అంగ‌వైక‌ల్యం ఉంద‌ని  ధృవీక‌రిస్తూ..... డాక్ట‌ర్ స‌ర్టిఫికేట్ ఉంది.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.