కోహ్లీ మ‌రో రికార్డ్

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

virat kohli
Updated:  2018-08-06 04:47:33

కోహ్లీ మ‌రో రికార్డ్

టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ వ‌ర‌ల్డ్ లో నంబ‌వ‌ర్ వ‌న్ ర్యాంకింగ్ ను సొంతం చేసుకున్నాడు. ఇంగ్లండ్ తో జ‌రిగిన తొలిటెస్ట్ లో భార‌త్ ప‌రాజ‌యం పాలు అయిన‌ప్ప‌టికి బ్యాట్ మెస్ సార‌ధి విరాట్ కోహ్లీ అద్బుత ప్ర‌ద‌ర్శ‌న అంద‌రిని ఆక‌ట్టుకుంది. ఇంగ్లండ్ మ్యాచ్ గెలిచినా, కోహ్లీ ప్ర‌పంచ వ్యాప్తంగా ఉన్న అభిమానుల మ‌న‌స్సును గెలుచుకున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్ర‌ద‌ర్శ‌నే కోహ్లీని నంబ‌ర్ వ‌న్ బ్యాట్స్ మెన్ గా చేసింది. 
 
తాజాగా విడుద‌ల చేసిన బీసీసీ టెస్ట్ ర్యాంకింగ్ లో ఆస్ట్రేలియా ఆట‌గాడు స్మిత్ ను దాటేసి కోహ్లీ తోలి స్థానాన్ని అధిరోహించారు. అయితే టెస్ట్ ల్లో నంబ‌వ‌ర్ వ‌న్ స్థానానికి చేరుకోవ‌డం కోహ్లీ కేరియ‌ర్ లో ఇదే తొలిసారి. ఎడ్జ్ బ్యాట్స్ మెన్ టెస్ట్ లో కోహ్లీ రెండు మ్యాచ్ ల‌ను క‌లిపి మొత్తం రెండు వంద‌ల ప‌రుగుల‌ను చేశారు. దీంతో 31 పాట్ల‌ను సాధించి బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో నంబ‌వ‌ర్ స్థానానికి చేరుకున్నారు. 
 
ఇక ఈ జాబితాలో గ‌త 32 నెల‌లుగా తొలిస్థానంలో కొన సాగుతున్న స్టీఫ్ స్మిత్ ను 5 పాయిట్ల‌తో కోహ్లీ వెన‌క్కి నెట్టారు. దీంతో ఈ ఘ‌న‌త సాధించిన ఏడ‌వ భార‌త ఆటాగాడిగా అవ‌త‌రించారు. 2011లో స‌చిన్ ఈ ఘ‌నత సాధించ‌గా ఈ తర్వాత ఈ రికార్డ్ ను అందుకున్న‌ది కోహ్లీనే. గతంలో స‌చిన్, రాహుల్ ద్రావిడ్ గౌత‌మ్ గంభీర్ సునీల్  గ‌వాస్క‌ర్, సెహ్వాగ్ నెంబ‌వ‌ర్ వ‌న్ టెస్ట్ బ్యాట్స్ మెన్ హోదాను అందుకున్న‌వారిలో కోహ్లీ ఉన్నారు.
 
 అయితే ఇప్ప‌టివ‌ర‌కు 67 టెస్టుల్లో ఆడిన కోహ్లీ తొలిసారి నంబ‌వ‌ర్ వ‌న్ ర్యాంకింగ్ ను అందుకున్నారు. ఇక ఇప్పుడు త‌న ర్యాంకును నిలుపుకోవాలంటే ఈ సిరీస్ మొత్తం త‌న ఫామ్ ను కొన‌సాగించాల్సి ఉంటుంది. తొలిటెస్ట్ కు కోహ్లీ ఖాతాలో 903 పాయిట్లు ఉన్నారు. టీమిడియా ఆల్ టైమ్ హైఎస్ట్ సునిల్ గ‌వాస్క‌ర్ క‌న్నా 13 పాయిట్లు వెనుక‌బ‌డి ఉండ‌గా ఇప్పుడు అత‌ని కంటే 18 పాయిట్లు ఎక్కువ‌సాధించారు. అంతేకాదు వన్డెల్లోనూ టాప్ ప్లేస్ లో కొన‌సాగుతున్నారు కోహ్లీ.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.