వాల్ మార్ట్ చేతిలో ఫ్లిప్ కార్ట్

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

wall mart and flipkart
Updated:  2018-04-14 12:01:17

వాల్ మార్ట్ చేతిలో ఫ్లిప్ కార్ట్

ఈ న‌వీన యుగంలో మ‌నం ఏదైన వ‌స్తువు  కావాలంటే  షాప్ ద‌గ్గ‌ర‌కు వెళ్ల‌కుండా మ‌న ఇంటి ద‌గ్గ‌ర‌కు ఆ వ‌స్తువు వ‌చ్చేలా సేవ‌ల‌ను అందిస్తోంది భార‌త దిగ్గ‌జ ఈ- కామ‌ర్స్ కంపెనీ ఫ్లిప్ కార్ట్... అయితే తాజా బిజినెస్ స‌మాచారం ప్ర‌కారం ఫ్లిప్ కార్ట్ మెజార్టీ షేర్ల‌ను అమెరికాకు చెందిన ప్ర‌ముఖ రిటైల్ సంస్థ వాల్ మార్ట్ కొనుగోలు చేయ‌నున్న‌ట్లు స‌మ‌చారం..
 
ఈ సంవ‌త్స‌రం జూన్ క‌ల్లా దీనికి సంబంధించిన ఒప్పందం పూర్తి అవుతుంద‌ని తెలుస్తోంది..ఫ్లిప్ కార్ట్ లో వున్న పాత షేర్లు కొత్త షేర్ల‌తో క‌లిపి సుమారు 51 లేదా అంత‌క‌న్నా ఎక్కువ షేర్ల‌ను కొనే దిశ‌గా వాల్ మార్ట్ ఆలోచిస్తోన్న‌ట్లు తెలుస్తోంది.
 
పాత ఒక్కొషేర్ ను వాల్ మార్ట్ 10 బిలియ‌న్ నుంచి 12 బిలియ‌న్ డాల‌ర్ల‌లోపు చెల్లించే ఆస్కారం ఉంద‌ని తెలుస్తోంది... కొత్త షేర్ల‌ను దాదాపు 18 బిలియన్‌ డాలర్లు పెట్టి కొన‌నున్న‌ట్లు ఓ మీడియా లో పేర్కొంది... ఇది కూడా వాల్ మార్ట్ కు అమెజాన్ కు పోటీ ఉన్న నేప‌థ్యంలో వాల్ మార్ట్  ఈ-కామర్స్‌ సంస్థ అయిన ఫ్లిప్ కార్ట్ తో ఒప్పందం కుదుర్చుకుంటున్నట్లు తెలుస్తోంది.
 
అయితే అమెజాన్‌ కూడా వాల్‌మార్ట్‌కు పోటీగా ఫ్లిప్ కార్ట్‌కు ఇంకా మంచి ఆఫర్‌ ఇవ్వనున్నట్లు సమాచారం. అయితే దీనిపై అధికారికంగా ఎలాంటి స‌మాచారం తెలుప‌లేదు...దీంతోపాటు జపాన్‌కు చెందిన సాఫ్ట్‌ బ్యాంకుకు ఫ్లిప్ కార్ట్‌లో దాదాపు ఐదో వంతు షేర్లు ఉన్నాయి...  అయితే సాఫ్ట్ బ్యాంకు తన షేర్లను అమ్మేందుకు సుముఖంగా లేదని తెలుస్తోంది. ఒకవేళ వాల్‌మార్ట్‌తో ఒప్పందం కుదిరితే ఫ్లిప్ కార్ట్ లోని ఇతర ఇన్వెస్టర్లు టైగర్‌ గ్లోబల్‌, యాక్సెల్‌ అండ్‌ నాస్పెర్స్‌ తమ షేర్లను వాల్‌మార్ట్‌కు అమ్మేందుకు ఆసక్తి చూపుతున్నట్లు సమాచారం.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.