అది ఉంటేనే వాట్సాప్ పేమెంట్స్

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

whats app
Updated:  2018-03-26 17:21:51

అది ఉంటేనే వాట్సాప్ పేమెంట్స్

సోష‌ల్ మీడియాలో ఒక‌టైన వాట్సాప్ ను భారి స్థాయిలో ఉప‌యోగించుకుంటారు యూజ‌ర్స్ . దీని ద్వారా ఫోటోలు, వీడియోలు, సందేశాలు, డాక్యుమెంట్లు, టెక్ట్స్  నోట్స్, ఇత‌రుల‌కు చేర‌వేస్తుంటాము. అయితే ఈ పోటీ ప్ర‌పంచంలో డ‌వ‌ల‌ప్ మెంట్ కు అనుగుణంగా కంపెనీ కొత్త ఫీచ‌ర్ల‌ను ఆవష్క‌ర‌ణ‌ల‌ను తీసుకువ‌స్తోంది న‌వీన టెకీల‌కు అన్నీ స‌దుపాయాలు క‌ల్పించే దిశ‌గా సాఫ్ట్ వేర్ దిగ్గ‌జాలు ఆవిష్క‌ర‌ణ‌లు చేస్తున్నాయి అందులో వాట్సాప్ కూడా ముందు ఉంటోంది.. ఇక న‌గ‌దు ర‌హిత లావాదేవీలు పెరుగుతుండ‌టంతో పేమెంట్ బ్యాంకుల‌కు బాగా ప్రాచుర్యం పెరుగుతోంది... ప‌లు యాప్స్ కూడా ఈ రంగంలో ముందుకు వెళుతున్నాయి.. బ్యాంకు పేమెంట్స్ యాప్స్ కాకుండా ఇప్పుడు సోష‌ల్ సైట్స్ కూడా పేమెంట్ యాప్స్ ను తీసుకువ‌స్తున్నాయి..
 
అందులో భాగంగా ఇటీవ‌ల‌ వాట్సాప్‌  కూడా ఆర్థిక లావాదేవీల‌ను చేసుకునేందుకు కొత్త ఆప్షన్‌ను అందుబాటులోకి తీసుకువ‌చ్చింది. ఈ యాప్‌ ద్వారా అత్యంత సులభంగా నగదు చెల్లింపులు,ఒక‌రినుంచి మ‌రొక‌రికి  బదిలీ చేయ‌వ‌చ్చ‌ని  ఈ సంస్థ చెబుతోంది... ఇక‌ తాజాగా వినియోగదారులకు మరింత సౌలభ్యం అందించేందుకు క్యూఆర్ కోడ్‌ను అందుబాటులోకి తెచ్చింది వాట్సాప్..అయితే ప్రస్తుతం బీటా  వెర్ష‌న్ వినియోగించుకునే వారికి మాత్ర‌మే ఈ ఫీచర్‌ లభిస్తోంది.
 
 
వాట్సాప్‌ బీటా వెర్షన్‌ 2.18.93లో స్కాన్‌ క్యూఆర్‌ కోడ్‌ ఆప్షన్‌ను ప్రవేశపెట్టారు. సెట్టింగ్స్‌లోని పేమెంట్స్‌ ఆప్షన్‌లో న్యూపేమెంట్‌- స్కాన్‌ క్యూఆర్‌ కోడ్‌ను సెలక్ట్ చేయడం ద్వారా ఈ ఆప్షన్‌ను వినియోగించుకోవచ్చు అని సంస్థ చెబుతోంది. ఎంత మొత్తం చెల్లించాలనుకుంటున్నారో నమోదు చేసి.. యూపీఐ పిన్‌ వెరిఫికేషన్‌ పూర్తి చేయడం ద్వారా నగదు పంప‌వ‌చ్చు. అంతేకాదు ‘సెండ్‌టూ యూపీఐ ఐడీ ఫీచర్‌ ద్వారా చాలా సులభంగా నగదు బదిలీ పూర్తి చేసుకోవచ్చు. 
 
!!wabetainfo!! ప్రకారం వాట్సాప్‌ అడ్వాన్స్‌డ్‌ జిఫ్‌ సెర్చ్‌ ఫీచర్‌ను సైతం పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వెర్షన్‌ 2.18.93 అప్‌డేట్‌ ద్వారా ఈ విషయం తెలిసింది. అయితే ప్రస్తుతానికి ఈ ఫీచర్‌ అందుబాటులో లేదని త్వరలో విడుదల చేయొచ్చని సమాచారం. అంతేకాదు వినియోగదారులు స్టిక్కర్స్‌ను కూడా సెర్చ్‌ చేసేలా ఫీచర్‌ను అందుబాటులోకి తేబోతున్నట్లు తెలుస్తోంది.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.