ఇంత వ‌ర‌కు చూడ‌ని కంప్యూట‌ర్‌

Breaking News

హోమ్        బిజినెస్‌      న్యూస్

small computer
Updated:  2018-03-22 01:54:49

ఇంత వ‌ర‌కు చూడ‌ని కంప్యూట‌ర్‌

కాలానికి అనుగుణంగా స‌మాజం, ప్ర‌జ‌లు మార్పు చెందుతున్నారు... ప్ర‌స్తుత న‌వీన యుగంలో అతి వేగంగా అభివృద్ది చెంద‌డానికి కంప్యూట‌ర్ అత్య‌వ‌స‌రం అని అంటారు... అయితే స‌మాజంలో ఇప్ప‌టి వ‌ర‌కు సూప‌ర్ కంప్యూట‌ర్ మొదలుకుని మైక్రో కంప్యూట‌ర్ వ‌ర‌కు మ‌నం వాటిని వినియోగించుకుని ముందుకుసాగాం. అయితే తాజాగా కొత్త కంప్యూట‌ర్ వెలుగులోకి వ‌చ్చింది.
 
ప్ర‌పంచంలోనే ఇంత వ‌ర‌కు మ‌నం చూడ‌నిది, ఊహించ‌న‌టువంటి అత్యంత సూక్ష్మ కంప్యూటర్‌ను రూపొందించినట్లు ప్రముఖ కంపెనీ ఐబీఎమ్‌ ప్రకటించింది. ఇది 1mmX1mm పరిమాణంతో అతి త‌క్కువ సైజులో ఉంటుంది. ఈ  అతిచిన్న కంప్యూట‌ర్‌కు ఉన్న భాగాల‌ను విడిగా చూడాలంటే భూతద్దాలు పెట్టుకోవాల్సిందే.
 
థింక్‌ 2018 కాన్ఫరెన్స్‌లో దీని వివరాలను వెల్లడించింది ఐబీఎమ్ కంపెనీ.. దీనికి సంబంధించిన ప్రొటోటైప్‌ డివైస్‌ను కంపెనీ ఆవిష్కరించింది. లాజిస్టిక్స్‌ అప్లికేషన్స్‌ కోసం రూపొందించిన ఈ కంప్యూటర్‌ ధర 0.10 డాలర్ల కంటే తక్కువగా ఉంటుందని కంపెనీ పేర్కొంటోంది... దీనిలో వేలాది ట్రాన్సిస్టర్లు, మెమొరీ, ఫొటోవోల్టిక్‌ పవర్‌ సప్లైని పొందుపరిచారు. అతి చిన్న, చౌక అయిన‌ దీన్ని ఏ డివైజ్‌కైనా అమర్చుకోవచ్చు,  ఎక్కడికైనా తీసుకెళ్ల‌వ‌చ్చు అని కంపెనీ పేర్కొంది. రోజువారీ వినియోగించే ఎలక్ట్రానిక్‌ వస్తువుల్లో దీన్ని అమర్చుకోవచ్చు.   
 
దీని ఫెర్మామెన్స్‌  1980ల్లోని ఎక్స్‌ 86 డెస్క్‌టాప్‌ తరహాలో పనిచేస్తుంది. దీన్ని బట్టి ఈ బుల్లి కంప్యూటర్‌ అద్భుత పనితీరు కనబరుస్తుందని చెప్పలేం...  కానీ బ్లాక్‌చైన్‌ విభాగంలో జరిగే డేటా మోసాలను సమర్థవంతంగా రికార్డ్‌ చేయగలుగుతుంద‌ని కంపెనీ ప్ర‌తినిధులు తెలిపారు.

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.