సీక్రెట్ అఫైర్ భర్తకు తెలిసిందని?

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-01-20 10:19:00

సీక్రెట్ అఫైర్ భర్తకు తెలిసిందని?

భ‌ర్త‌లు భార్య‌పై దాడులకు దిగ‌డం, వారిపై అనుచిత ప్ర‌వ‌ర్త‌న శాడిజం చూపించ‌డం అనేది గ‌తంలో అనేక కేసుల్లో విన్నాం.. తాజాగా మ‌హిళ‌లు భ‌ర్త‌ల‌పై దాడుల‌కు  దిగ‌డం, చివ‌ర‌కు వారి అవ‌స‌రం లేదు అనే నిర్ణ‌యంతో ఏకంగా అంత‌మొందించ‌డం అనే రీతిన దాడుల‌కు పాల్ప‌డుతున్నారు భార్య‌లు.

గుంటూరు జిల్లాలో దారుణ‌మైన ఘ‌ట‌న జ‌రిగింది... వేమూరులో నివ‌సించే శాంతికి తొమ్మిదేళ్ల క్రితం చంటితో వివాహం అయింది.. వీరికి ముగ్గురు పిల్ల‌లు ఉన్నారు.. శాంతి ప్ర‌భుత్వ ఆస్ప‌త్రిలో స్వీప‌ర్ గా ప‌నిచేస్తోంది.. ఈ స‌మ‌యంలో ప‌లువురితో వివాహేత‌ర సంబంధం పెట్టుకుంది.. అయితే చంటి ప‌నిముగించుకుని వ‌స్తున్న స‌మ‌యంలో శాంతి పొలంలో ఓ వ్య‌క్తితో స‌న్నిహితంగా క‌నిపించింది.. దీంతో ఆమెను చంటి ప్ర‌శ్నించాడు, అక్క‌డే ఆమెను కొట్టాడు.. చివ‌ర‌కు  ఊరిలోని పెద్ద మ‌నిషి వద్ద పంచాయ‌తీ పెట్టించాడు.

అయితే ఆమె దేనికి స‌మాధానం చెప్ప‌లేదు. త‌ర్వాత చంటి ఇంటికి వ‌చ్చి నిద్ర‌పోయాడు.. అయితే రాత్రి డ్యూటికి వెళ్లి ఒంటి గంట ప్రాంతానికి వ‌చ్చిన శాంతి, త‌న ప‌రువును తీశాడ‌ని భ‌ర్త‌పై క‌క్ష గ‌ట్టింది.. నిద్ర‌పోతున్న భ‌ర్త‌పై పెయింట్‌ థిన్నర్‌ పోసి నిప్పంటించింది.. దీంతో అత‌ని ఒళ్లంతా గాయాలు అయ్యాయి వెంట‌నే  అత‌నిని ఆస్ప‌త్రికి త‌ర‌లించారు చంటి కుటుంబ‌స‌భ్యులు.. చంటి శ‌రీరానికి నిప్పు పెట్ట‌డం వ‌ల్ల 55 శాతం శ‌రీరం కాలిపోయింద‌ని  వైద్యులు తెలిపారు. శాంతి కావాల‌నే త‌న కుమారుడ్ని చంప‌డానికి య‌త్నించింది అని ఆమె పై పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు చంటి కుటుంబ స‌భ్యులు.. చివ‌ర‌కు తన భ‌ర్త‌కు సేవ‌లు చేస్తూ ఆస్ప‌త్రిలో క‌న్నీరు పెట్టుకుంటోంది శాంతి.

 

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.