హైదరాబాద్ లో ఎక్కడ కోళ్ల పందాలను పెట్టారో తెలుసా..

Breaking News

హోమ్        క్రైమ్      న్యూస్

Updated:  2018-01-20 10:04:07

హైదరాబాద్ లో ఎక్కడ కోళ్ల పందాలను పెట్టారో తెలుసా..

తెలుగు రాష్ట్రాల‌లో ప్ర‌తీ  పండుగ‌కు ఏదో ఒక సంప్రదాయం ఉంటుంది... అయితే సంక్రాంతి పండుగ స్పెష‌ల్ అంటె  ఠ‌క్కున గుర్తోచ్చేది కోళ్ల‌పందాలు... ఈ  పండుగ స‌మ‌యంలోఉభ‌య గోదావ‌రి జిల్లాల‌ ప్రాంత వాసులు సంప్ర‌దాయ‌కంగా ప్ర‌తి ఏడాది కోళ్ల‌పందాల‌ను జ‌రుపుకుంటూ వ‌స్తున్నారు. అయితే ఈ సంప్ర‌దాయాన్ని  గ‌త కొన్ని సంవ‌త్స‌రాలుగా బెట్టింగ్ గా మార్చుకొని దాదాపు కొన్ని కోట్ల రుపాయ‌లను చేతులు మార్చుకుంటున్నారు. 

ఈ కోళ్ల‌పందాలను  నిర్వ‌హించ‌రాదంటూ  సుప్రీమ్ కోర్టు ఉత్త‌ర్వులు జారీ చేసినా వాటిని తుంగ‌లో తోక్కి.. కోడి పందాల‌ను నిర్వ‌హించారు. అయితే సుప్రీమ్ కోర్టు ఉత్త‌ర్వులు మేర‌కు వీటిని నిర్వ‌హించ‌కూడ‌ద‌ని పోలీసులు ఎంత క‌ట్టు దిట్టం వ‌హించినా,  కొన్ని చోట్ల పోలీసుల చేతులు త‌డిపి గ్రామ‌స్తులు కోళ్ల పందాల‌ను మొద‌లు పెట్టారు.  

అయితే కోళ్ల‌పందాలు ఉభ‌య గోదావ‌రి జిల్లాల ప్ర‌జ‌ల‌కే ప‌రిమితం కాలేదు. ఇది కాస్త వైర‌స్ గా మారి మెల్ల‌గా  ఆ సెగ‌ హైద‌రాబాద్ మ‌హాన‌గ‌రానికి  తాకింది... గ‌త కొంత కాలంగా మ‌హాన‌గ‌రంలో కోళ్ల‌పందాలు నిర్వ‌హిస్తున్నారని పోలీసుల‌కు తెలిసినా ....ఈ పందాల‌ను  ఎక్క‌డ చేప‌డుతున్నార‌న్న పూర్తి స‌మాచారం తెలియ‌క పోవ‌డంతో ప‌లు చోట్ల పోలీసులు గాలింపులు మొద‌లు పెట్టారు. ఈ గాలింపు చ‌ర్య‌ల‌లో  టాస్క్ ఫోర్స్ పోలీసులు నెల్లూరు జిల్లా కావ‌లి మండ‌లం వైకుంఠ‌పురానికి చెందిన వెంక‌టకృష్ణ, ప్ర‌కాశం జిల్లా వాసి  వెంక‌ట ప్ర‌సాద్ లను ప‌ట్టుకున్నారు.. వీరు  శ్రీన‌గ‌ర్ లో కోళ్ల‌పందాల‌ను  నిర్వ‌హిస్తున్నార‌ని పోలీసుల‌కు స‌మాచారం అందింది. దీంతో వీరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు తెలిపిన క‌థ‌నం ప్రకారం వెంక‌ట‌కృష్ణ‌, వెంక‌ట ప్ర‌సాద్ లు ఇద్ద‌రూ కొన్ని సంవ‌త్స‌రాల క్రితం బ్ర‌తుకు దెరువు కోసం హైద‌రాబాద్ వ‌చ్చారు. అయితే  వారిద్ద‌రూ ఈ సంక్రాంతి పండుగ‌కు అధిక డ‌బ్బు  సంపాదించుకోవాల‌నే ఉద్దేశంతో  శ్రీన‌గ‌ర్ కాల‌నిలో ఓ అపార్ట్ మెంట్ లో కోళ్ల‌పందాల‌ను నిర్వ‌హిస్తున్నారు. అయితే టాస్క్ ఫోర్స్ పోలీసులు ప‌క్కా స‌మాచారంతో ఆ అపార్ట్ మెంట్ పై దాడి చేసి వారి ద‌గ్గ‌ర నుంచి  17 పందెం కోళ్ల‌ను, 60 పందెం క‌త్తుల‌ను, 26 మొబైల్ ఫోన్ల‌ను అధిక మొత్తంలో న‌గ‌దును స్వాధీనం చేసుకున్నారు.

 

షేర్ :

Comments

0 Comment

తాజా వార్తలు

Copyright © Janahitham. All rights reserved. Designed by Aakruti.